Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.వెంకటయ్య
నవతెలంగాణ-దోమ,పరిగి
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ నిరుపదలపై మోయలేని భారాన్ని మోపుతుందని వాటిని ప్రజలు ప్రతిఘటించాలని సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పరిగి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఐదవ రోజు సీపీఐ(ఎం), వ్య.కా.సంఘం ఆధ్వర్యంలో పరిగి తహసీల్దార్ కార్యాల యం ఎదుట కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలను సీపీఐ(ఎం) జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.వెంకటయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.వెంకటయ్య మాట్లాడుతూ పరిగి మండలం రంగాపూర్, పరిగి పట్టణంలోని శిఖం, ఇనాం, నారాయణ పూర్ రెవెన్యూ గ్రామం పరిధిలోని స్టీల్ ఫ్యాక్టరీ ఆక్రమిం చుకున్న భూదాన్ ప్రభుత్వ భూముల్లో పేదలకు 120 గజాల ఇండ్ల స్థలాల్లో ఇవ్వాలని, ఇండ్లు నిర్మించేందుకు రూ.5 లక్షల పభుత్వం ఇవ్వాలని, అర్హులైన పేదలందరికీ డబల్ బెడ్ రూమ్లు ఇవ్వాలన్నారు. నేటి దీక్షలలో దోమ మండలం, రాకొండ గ్రామానికి చెందిన సీపీఐ(ఎం), వ్యవ సాయ కార్మిక సంఘం నాయకులు, ప్రజలు పాల్గొన్నారాని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిత్యావసరాలపై జీఎస్టీ విధించి ప్యాకింగ్ ఆహార పదార్థాలపై 5 నుండి 12 శాతం 15 శాతం జీఎస్టీ పెంచిందన్నారు. ప్రధానంగా డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరల పెరుగుదలకు కేంద్రం 31 శాతం డీలర్, 4 శాతం రాష్ట్రం 23 శాతం పన్నులు విధిం చడం వల్ల లీటర్ కీ రూ. 100 పెరిగిందన్నారు. ధరలకు పెరుగుదలకు కారణమైన జీఎస్టీని రద్దు చేసి, గ్యాస్ సబ్సిడీని పునరుద్ధరించాలన్నారు. ప్రధాన రంగాలైన విద్య, వైద్యాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పి ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేస్తుందన్నారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కన్వీనర్ ఎండీ హబీబ్, మండల నాయకులు బసి రడ్డి, సత్యయ్య, శేఖర్, వెంకటయ్య, శీను, జంగయ్య, శ్రీని వాస్, వెంకటేష్, శ్రీనివాస్, వెంకటయ్య, జనార్దన్, రాము లు, కృష్ణ, అసిఫ్ తదితరులు పాల్గొన్నారు.