Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోలి శ్రీనివాస్ రెడ్డి
- గోలి సమక్షంలో టీఆర్ఎస్లోకి ఆమనగల్ యువకులు
నవతెలంగాణ-ఆమనగల్
సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టా త్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను నియోజ కవర్గంలోని ప్రతి గడపకూ అందేలా చూడాలని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోలి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆమనగల్ పట్టణానికి చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్య కర్తలు దాదాపు 40 మంది శనివారం గోలి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో గోలి శ్రీనివాస్ రెడ్డి మా ట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకూ ఉప యోగపడే విధంగా సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్శి తులై ఇతర పార్టీల నాయకులు కార్య కర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూడాలని ఆ విధంగా కార్యకర్తలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్, ఆమ నగల్ కడ్తాల్ మండలాల పీఏసీఎస్ చైర్మెన్ గంప వెంకటేష్ గుప్తా, ఎంపీటీసీల సంఘం జిల్లా కార్యదర్శి బొప్పిడి గోపాల్, జిల్లా రైతు సమ న్వయ కమిటీ సభ్యు డు బాచిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కడ్తాల్ మండల అధ్యక్షుడు జోగు వీరయ్య, ఏఎంసీ డైరెక్టర్ సురమల్ల సుభాష్, నాగర్ కర్నూల్ జిల్లా ఉపసర్పంచ్‌ల సంఘం అధ్య క్షుడు గుమ్మ కొండ రాజు, సీనియర్ నాయకులు రూపం వెంకట్ రెడ్డి, చలి చీమల సతీష్, శివ కుమార్, గోపి, రవి పాల్గొన్నారు.