Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్
- శంషాబాద్‌లో హెచ్జీటీఏ గోల్డెన్ జూబ్లీ సంబురాలు
- హెచ్జీటీఏ లోగో ఆవిష్కరించిన మంత్రి
నవతెలంగాణ- శంషాబాద్
రహదారి రవాణా రంగం దేశ ప్రగతికి వెన్ను ముక లాంటి అత్యంత ముఖ్యమైనదని, తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరుకుమార్ తెలిపారు. శనివారం శంషాబాద్‌లో హైదరాబాద్ గూడ్స్ ట్రాన్స్ పోర్ట్ అసోసియేషన్ వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన హెచ్జీటీఏ కొత్త లోగోను ఆవిష్కరించారు. 1971లో ఏర్పాటైన హైదరాబాద్ గూడ్స్ ట్రాన్స్ పోర్ట్ అసోసియేషన్ 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గోల్డెన్ జూబ్లీ వేడుకలు నిర్వహించారు. హైదరాబాద్ నలుమూలల నుంచి ట్రాన్స్పోర్ట్ వ్యాపారాలు భారీఎత్తున హాజరయ్యారు. స్వర్ణోత్సవాల సభకు హైదరాబాద్ గూడ్స్ ట్రాన్స్ ఫోర్టు అసోసియేషన్ కార్యదర్శి వినీల్ పర్వతనేని స్వాగతం పలుకగా, అధ్యక్షులు అజరు కుమార్ బన్సల్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వస్తువులను రవాణా చేయ డంలో పంపిణీ చేయడంలో నగరాల్లో నడుస్తున్న స్థానిక రవాణా కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం రవాణా రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నదని అన్నారు. అవసరం ఉన్నచోట కోల్డ్ స్టోరేజ్ లు కావలసిన సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. దేశంలో గాని ప్రపం చంలో ఎక్కడైనా వ్యవసాయం, పరిశ్రమలు సేవల రంగానికి సమ ప్రాధాన్యత కల్పిస్తుందని ఉన్నారు. ట్రాన్స్పోర్ట్ రంగం అభివృద్ధి చెందితేనే రాష్ట్ర సమగ్ర అభివృద్ధి సాధ్యమవు తుందని ఆ దిశగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలి పారు. రవాణా రంగ వ్యాపారులు రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని మంత్రి కోరారు. అశోక్ లేల్యాండ్, హెవీ, మీడియం కమర్షియల్ వెహికల్స్ హెడ్ సంజీవ్‌కుమార్ మాట్లా డుతూ దేశీయ రవాణా అనేది దేశ ఆర్థిక వృద్ధికి కీలకమని అన్నారు. లారీ యజమానులు, డ్రైవర్లు లోడ్మెన్ సరుకులను నిర్వహించడం, రవాణా చేయడంలో విశేషమైన సేవ అందిస్తున్నారని అన్నారు. వారికి ప్రభుత్వాలు మౌలిక, కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు. భద్రతా చర్యలపై డ్రైవర్లకు అవగాహన కల్పించా ల్సిన గురుతర బాధ్యత లారీ యజమానులపై ఉండదని, డ్రైవర్లకు ఎప్పటికప్పుడు అవహగానా కల్పిస్తే ప్రమాదాలు తక్కువగా జరిగే అవకాశాలు ఉంటాయని చెప్పారు. ఈ సభలో హైదరాబాద్ గూడ్స్ ట్రాన్స్ పోర్ట్ అసోసియేషన్ నేతలు అంజనీ కుమార్ అగర్వాల్, నరేష్ గుప్తా, రామ్‌కుమార్ రాఠీ, వినోద్ ఆర్య పాల్గొన్నారు.