Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజలకు మంచి పాలన అదించాలి
- సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు కర్నాటి శ్రీనివాస్ రెడ్డి
- తహసీల్దార్ అనితకు వినతి
నవతెలంగాణ-మంచాల
కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు వెనక్కి తీసుకుని, ప్రజలకు మంచి పాలన అందించాలని తహసీల్దార్ అనితకు శనివారం సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు కర్నాటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా ప్రభుత్వం గ్యాస్ ,డీజిల్ ,పెట్రోల్, నిత్యవసర ధరలు పెంచి సాన్యుడు ఏమీ కొనలేని పరిస్థితి ఏర్పడిం దన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ రంగా సంస్థలను ప్రయివేట్ పరం చేస్తూ, నిరుద్యోగం పెంచుతూ ఉన్న ఉద్యోగాలకు భద్రత లేకుండా చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వెనక్కు తీసుకుని ,ప్రజలకు మంచి పాలన అందించాలని కోరారు. లేనియేడలా సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ప్రజలను ఏకం చేసి కేంద్ర ప్రభుత్వం పై ప్రజా పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు పోచామొని కృష్ణ, సిలివేరు రాజు, ఆర్ స్వామి, ఆవుల యాదయ్య, పగడాల వెంకటేష్, లెనిన్, దంచుక భిక్షపతి, గ్రామ కార్యదర్శులు తదితరులు ఉన్నారు.