Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మియాపూర్
మియాపూర్ డివిజన్ పరిధిలోని స్టాలిన్‌నగర్‌లో తాగునీటి పైప్‌లైన్ వేయాలని స్టాలిన్ నగర్ సంక్షేమ సంఘం ప్రతినిధులు ఖైరతాబాద్‌లోని హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై సివరేజ్ బోర్డ్ మేనేజింగ్ డైరెక్టర్ దాన కిషోర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా స్టాలిన్ నగర్ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి మైదం శెట్టి రమేష్ మాట్లాడుతూ 20 ఏండ్ల క్రితం శేరిలింగంపల్లి పూరపాలక సంఘంగా ఉన్నప్పుడూ వినియోగించుకునేందుకు నీటి కోసం వేసిన హెచ్‌డీసీ పైప్లైన్లకు నాటి అధికారులు ఇంటింటికీ తాగునీటి కనెక్షన్లు ఇచ్చినట్టు తెలిపారు.కాగా నాలుగేండ్ల క్రితం కాలనీలోని మెయిన్ రోడ్డులో కొత్తగా బీడుపైపు లైన్ వైసి, మరికొంత మంది ఇండ్లకు నీటి కనెక్షన్లు ఇచ్చారు. అయితే ఈ కనెక్షన్ల పైపులన్నీ గతపూరపాలక సంఘం ఆధ్వర్యంలో 20 ఏండ్ల క్రితమే 4-5 అడుగుల లోతు నుంచి ఇండ్లలోకి నీరు సరఫరా అవుతోందనీ ఎండీ దృష్టికి తీసుకెళ్లారు. కొన్నేండ్ల నుంచి జీహెచ్ఎంసీ అధికారులకు ఆ తర్వాత వాటర్ వర్క్స్ అధికారులకు అనేక వినతి పత్రాలు అందించినా పట్టించుకోవడం లేదని గుర్తు చేశారు. 2019లో దాన కిషోర్ స్టాలిన్ నగర్ సందర్శనకు వచ్చినప్పుడు ఈ సమస్య స్వయంగా పరిశీలించానని కిందిస్థాయి అదికారులకు ఆదేశాలి చ్చినప్పటికీ గత నాలుగేండ్లుగా పరిష్కరించడం లేదని ఆయన పేర్కొన్నారు. కాలనీలోని ప్రతి ఇంటికీ తాగునీటి సరఫరా చేసేందుకు పైప్ లైన్ వేస్తూ, కనెక్షన్లు ఇవ్వాలని మెట్రో వాటర్ వర్క్స్ మేనేజింగ్ డైరెక్టర్ దాన కిషోర్‌కు వినతపత్రం అందజేశారు. డిపార్ట్మెంట్ మీటింగ్‌లో ఉన్న ప్రాజెక్టు వన్ డైరెక్టర్ రెడ్డి శ్రీధర్ బాబు, మియాపూర్ డీజీఎం నాగ ప్రియకు స్టాలిన్ నగర్లో వెంటనే తాగునీటి పైపులైన్ వేయాలని సంబంధించిన అధికాకరులకు ఆదేశించినట్టు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలొ స్టాలిన సంక్షేమ సంఘం ప్రతినిధులు అండూరి శంకర్, దేపూరి శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.