Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యువత చేతిలోనే దేశ భవిత
- స్థానిక సీఐ డీకే లక్ష్మిరెడ్డి, ఎంపీడీవో సంధ్య
నవతెలంగాణ-మొయినాబాద్
విద్యతోనే అత్యున్నత శిఖరాలను అధిరోహిం చవచ్చనని స్థానిక సీఐ లక్ష్మీరెడ్డి, ఎంపీడీవో సంధ్య అన్నారు. శనివారం మండల కేంద్రంలోని అరి స్టాటిల్ పీజీ కళాశాలలో వార్షిక దినోత్సవం, ఎంబీఏ ద్వితీయ సంవత్సర విద్యార్థులకు వీడ్కోలు సమా వేశం ఏర్పాటు చేశారు .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక సీఐ డీకే లక్ష్మీరెడ్డి, మండల ఎంపీడీవో సంధ్య హాజరై, మాట్లాడుతూ యువత చేతిలోనే దేశ భవిత ఉందన్నారు.యువతే నాయ కత్వం వహించి దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ఉన్నతమైన కలలుగని వాటిని సహకారం చేసుకునేందుకు శక్తివంచన లేకుండా కృషి చేయాలని కోరారు. అనంతరం వారి అనుభ వాలను పంచుకున్నారు. కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ అరిస్టాటిల్ కళాశాల మెరుగైన విద్యను అందించేందుకు కృషి చేస్తుందన్నారు.ఈ కళాశాలకు మంచి గుర్తింపు ఉందని విద్యనభ్యసించిన విద్యా ర్థులకు బంగారు బాటలు వేసేం దుకు ఎల్లవేళలా కృషి ఉంటుం దన్నారు. కార్యక్ర మంలో కేజీఆర్సీ ఈ టి ప్రిన్సిపాల్ డాక్టర్. విజయలత డాక్టర్. ఆర్ఎస్ జాగిర్ధార్, సీఈఓ డాక్టర్. మధుసూదన్ పాల్గొన్నారు. వీడ్కోలు సమావేశంలో భాగంగా జూనియర్ విద్యార్థులు సాంస్కతిక కార్యక లాపాలను నిర్వహించి పలువురిని అలరించారు. కళాశాల టాపర్స్ స్పోర్ట్స్ చెస్, క్యారమ్స్ లో గెలిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.