Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మండల వ్యవసాయ అధికారి రాగమ్మ
నవతెలంగాణ-మొయినాబాద్
వరి పంటను తెగుళ్లు, పురుగు ఆశించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మండల వ్యవసాయ అధికారి రాగమ్మ రైతులకు వివరించారు. శనివారం మండలంలోని యెనికేపల్లి గ్రామంలో రైతు సత్యనారాయణ పంట పొలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వేదజల్లే పద్ధతిలో వేసిన వరి, జనములు, పచ్చి రొట్ట, వేసి దున్ని వరివేసిన పొలాలను పరిశీలించినట్టు తెలిపారు. జనుములు వేసే రైతులు పైపాటుగా వేసే యూరియా మోతాదును తగ్గించుకోవాలని సూచించారు. వరిలో కాండం అగ్గి తెగులు ఆశించికుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు.ఈ కార్యక్రమంలో ఏఈఓ సునీల్ కుమార్ రైతులు తదితరులు పాల్గొన్నారు.