Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చందనవెళ్లి భూనిర్వాసితులు
నవతెలంగాణ-షాబాద్
భూములు కోల్పోయిన రైతులకు న్యాయపరమైన ఆర్థికపరిహారం అంద కుంటే అసెంబ్లీని ముట్టడిస్తామని చందనవెళ్లి భూనిర్వాసితులు హెచ్చరించారు. తమకు న్యాయం చేయాలని భూనిర్వాసితులు కొనసాగిస్తున్న దీక్ష శనివారం 56వ రోజుకు చేరుకుంది. బీజేపీ జిల్లా అధ్యక్షులు బొక్క నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో భూ నిర్వాసితులు చేవెళ్ల ఆర్డీవో వేణుమాధవ్‌ను కలిసి రైతులకు రావాల్సిన పరిహారం అందేలా చూడాలని కోరారు. దీంతో 'తనకు పది రోజుల సమయం ఇవ్వాలని మీకందరికీ న్యాయం జరిగేలా చూస్తానని' ఆర్డీవో హామీని చ్చిట్టు పేర్కొన్నారు. పది రోజుల సమయంలో తమకు న్యాయం జరగకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని భూనిర్వాసితులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భూ నిర్వాసితుల సంఘం అధ్యక్షులు ఆంజనేయులు, బీజేపీ నాయకులు కిరణ్, రాము, శ్రీధర్‌రెడ్డి, భూ నిర్వాసితులు శోభ తదితరులు ఉన్నారు.