Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చందానగర్
చందానగర్‌లోని డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ మున్సిపల్ కల్యాణ మండపంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ సర్కిల్ పరిధిలోని చందానగర్ డివిజన్ పరిధిలోని అర్హులైన 798 మంది లబ్దిదారులకు ఆసరా పింఛన్ గుర్తింపు కార్డులు డీసీ సుధాంష్ , ప్రాజెక్టు ఆఫీసర్ ఉషా రాణి, కార్పొరేటర్ మంజులారఘునాథ్రెడ్డితో కలిసి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ పంపిణీ చేసిన పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచినట్టు తెలిపారు. కులమతాలకతీతంగా, ప్రాంత, పార్టీల భేదం లేకుండా అర్హులందరికీ ఆసరా పింఛన్లు అందజేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుం దన్నారు.ఈ కార్యక్రమంలో కార్తిక్, మాజీ కౌన్సిలర్ రవీందర్ రావు, మాజీ కార్పొరేటర్లు అశోక్ గౌడ్, మాధవరం రంగరావు, చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, టీఆర్ఎస్ నాయకులు మిర్యాల రాఘవరావు,ఉరిటీ వెంక ట్రావు, జనార్ధన్‌రెడ్డి, కర్ణాకర్‌గౌడ్, దాసరి గోపి, మిద్దెల మాల్లారెడ్డి, పులిపాటి నాగరాజు, రవీందర్ రెడ్డి, వెంకటేష్, అక్బర్ ఖాన్, రఘు నాథ్, పారునంది శ్రీకాంత్, నరేం దర్ బల్లా, కార్తీక్ గౌడ్, వరలక్ష్మి రెడ్డి, అంజద్ పాషా ,యశ్వంత్, కొండల్ రెడ్డి, దీక్షిత్ రెడ్డి, సందీప్, అమిత్, ప్రవీణ్ కార్యకర్తలు, మహిళ నాయకులు, టీఆర్ఎస్ అనుబంధ సంఘాల ప్రతినిధులు, శ్రేయభిలాషులు, లబ్దిదారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.