Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
నవతెలంగాణ-మంచాల
ప్రతి ఒక్క రైతు ప్రకృతి వ్యవసాయం చేసి బావితరాలకు మంచి ఆరోగ్యాన్ని అందించాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలోని లింగంపల్లి గ్రామంలో తెలంగాణ డెవలప్ మెంట్ ఫార్మావారి అధ్వ ర్యంలో రైతులకు ప్రకతి వ్యవసాయంపై అవగాహనా సదస్సు నిర్వహించారు.ఆ సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడుతూ ప్రతి రైతూ ప్రకృతి వ్యవసాయం చేసి రాబోయే తరాలకు మంచి ఆరోగ్యాన్ని అందించడమే కాకుండా, మన భూములను కాపాడుకోవాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయం కొనసాగిస్తున్న నాగార్ కర్నూల్ జిల్లా రైతులు లావణ్య రమణా రెడ్డిలకు అభినం దనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మం చాల ఎంపీపీ నర్మదాలచ్చిరాం, ఇబ్రహీం పట్నం ఎంపీపీ కృపేష్, వైస్ ఎంపీపీ ప్రతాప్‌రెడ్డి, డీఏవో గీతారెడ్డి, ఏడీఏ సత్యనారాయణ, హర్టికల్చర్ అధికారి సునంద, టీడీఎఫ్యూఎస్ ప్రెసిడెంట్ దినేశ్ రెడ్డి, రాజీ రెడ్డి,నరేందర్ ,రాజేష్ ,వివిధ మండలాల అధికారులు, ఎన్పీటీసీ, సర్పంచ్‌లు, కుకుడాల శ్రీనివాస్‌రెడ్డి, చివిరాల పాండు,ఎంపీటీసీ చీరాల రమేశ్, లట్టుపల్లి చంద్రశేఖర్‌రెడ్డి తదితరులున్నారు.