Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లేశం
నవతెలంగాణ-వికారాబాద్ ప్రతినిధి
పెరుగుతున్న ధరలు వెంటనే తగ్గించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లేశం డిమాండ్ చేశారు. కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా వికారాబాద్ జిల్లాకేంద్రంలో ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అన్నీంటి ధరలు పెంచి ప్రజలపై భారం మోపుతోందన్నారు. మరో పక్క ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతోందన్నారు. దేశ సంపదను పెట్టుబడిదారులకు ధారాదత్తం చేస్తోందన్నారు. ప్రశ్నించే వారిపై తప్పుడు కేసులు పెడుతోందన్నారు. రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి తప్పకుండా గుణపాఠం చెబుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు మహిపాల్, జిల్లా నాయకులు సుభాష్, సతీష్, కె.మనిక్నాయక్, కె.శ్రీనివాస్, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు వెంకట్, తదితరులు పాల్గొన్నారు.