Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అసైన్ రైతులకు న్యాయం చేయాలి
- సీపీఐ(ఎం) మున్సిపల్ కార్యదర్శి సీహెచ్ ఎల్లేష్
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
రాష్ట్ర ప్రభుత్వం మినీ స్టేడియం పేరుతో రైతులకు చెందిన భూములను గుంజుకుంటుందని సీపీఐ(ఎం) ఇబ్రహీంపట్నం మున్సిపల్ కార్యదర్శి సిహెచ్ ఎల్లేష్ ఆందో ళన వ్యక్తం చేశారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధి లోని ఖానాపూర్ సర్వేనెంబర్ 43/1లో మినీ స్టేడియం పేరుతో ప్రభుత్వ స్వాధీనం చేసుకున్న భూముల్లో నిర్వాసిత రైతులు నిరాహార దీక్షకు పూనుకున్నారు. ఈ దీక్షకు ఆయన మద్దతు పలుకుతూ మాట్లాడారు. ఇబ్రహీంపట్నం మున్సి పల్ పరిధిలో ఖానాపూర్ సర్వే నంబర్ 43 /1 లో 1992 లో ఇబ్రహీంపట్నం అప్పటి ఎమ్మెల్యే మాస్కు నర్సింహా నాయకత్వంలో ప్రతి ఒక్కరికీ 7.8 గుంటల చొప్పున 60 మందికి సర్టిఫికెట్ ఇవ్వడం జరిగిందన్నారు. ఆ భూము లను నేటి ప్రభుత్వం మినీ స్టేడియం ఇతర ప్రభుత్వ అవసరాల కోసం రైతుల నుంచి సేకరిస్తుందని తెలిపారు. ఎనిమిది నెలల క్రితం ఈ నిర్వాసితులకు రెండు ఫ్లాట్లో చొప్పున ఇంటి స్థలాలను ఇస్తామని చెప్పి మోసం చేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. 8 నెలలు కావస్తున్నా నేటికీ ఇళ్ల స్థలాలు ఇవ్వకపోగా సదరు భూముల్లో ప్రభుత్వ కార్యకలాపాలు కొనసాగిస్తుందని తెలిపారు. రైతులను ఆ భూముల్లోకి రాకుండా నిర్బంధం విధిస్తోందన్నారు. కేసుల పేరుతో బెదిరిస్తోందని అన్నారు. గతంలో రైతులు డివిజన్ రెవెన్యూ అధికారిని కలిసి వినతి పత్రం అందజేసిన సందర్భంగా ఆ భూములను రైతుల దున్నుకోవచ్చని చెప్పి ఆ మర్నాడు ముగ్గురు రైతులపై కేసు నమోదు చేయడం ఏమిటనీ ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నా యకులు యాదగిరి, రైతులు మల్లేష్, యాదయ్య, సత్త య్య, శ్రీను, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.