Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అర్హులైన పేదలందరికీ డబల్ బెడ్ రూమ్లు ఇవ్వాలి
నవతెలంగాణ-దోమ, పరిగి
సీపీఐ(ఎం), వ్య.కా.సంఘం ఆధ్వర్యంలో ఇండ్ల స్థలాలు ఇవ్వాలని చేస్తున్నా దీక్షలకు బీసీ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంలాల్ కృష్ణ సంపూర్ణ మద్దతు తెలి పారు. ఆరో రోజు సీపీఐ(ఎం), వ్య.కా.సంఘం ఆధ్వర్యంలో పరిగి తహసీల్దార్ కార్యాలయం ఎదుట కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు సంపూర్ణ మద్దతు తెలుపుతూ దీక్షలో కూర్చున్న సీపీఐ(ఎం), వ్య.కా.సంఘం నాయకులకు పూల దండాలు వేసి బీసీ సంఘం రాష్ట్ర కన్వీనర్ ఏం లాల్ కృష్ణ ప్రసాద్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీపీఐ(ఎం), వ్య.కా.సంఘం నాయకులు చేస్తున్న దీక్షలు న్యాయమైనవని 6 రోజులుగా దీక్షలు చేస్తు న్న అధికారులు, ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గ మని అన్నారు. పరిగి మండలం రంగాపూర్, పరిగి పట్ట ణంలోని శిఖం, ఇనాం, నారాయణపూర్ రెవెన్యూ గ్రామం పరిధిలోని స్టీల్ ఫ్యాక్టరీ ఆక్రమించుకున్న భూదాన్ ప్రభుత్వ భూముల్లో పేదలకు 120 గజాల ఇండ్ల స్థలాల్లో ఇవ్వాల న్నారు. ఇండ్లు నిర్మాణానికి రూ.5 లక్షల ప్రభుత్వం ఇవ్వా లని, అర్హులైన పేదలందరికీ డబల్ బెడ్రూమ్లు ఇవ్వాల ని అన్నారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం)జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.వెంకటయ్య, వ్యవసాయ కార్మికసంఘం మం డలాధ్యక్షులు బసిరెడ్డి, దోమ మండలం అధ్యక్షులు హెచ్. సత్యయ్య, శేఖర్, రఘురామ్ తీర్మాలయ్య, నర్సిములు, బుచ్చయ్య, వెంకటేష్, అనిల్, నాయకులు పాల్గొన్నారు.