Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజల మధ్య చిచ్చు పెడుతున్న బీజేపీ
- దళితులను మోసం చేస్తున్న కేసీఆర్
- బీఎస్పీ రాష్ట్ర నాయకులు విజరు ఆర్య, సిద్దు రావణ్
నవతెలంగాణ-మర్పల్లి
70 ఏళ్లుగా అధికారం చేపట్టి బడుగు బలహీన వర్గా లను మోసం చేస్తున్న కాంగ్రెస్, బీజేపీ, టీిఆర్ఎస్లకు వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పి బహుజన రాజ్యం స్థాపిం చి అంబేద్కర్ కలను నిజం చేద్దాం అని బీఎస్పీ రాష్ట్ర కార్య దర్శి విజరు ఆర్య, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ నెంబర్ సిద్దు రావణ్ లు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో ఎన్‌సీఎమ్ ఫంక్షన్ హాల్లో బీఎస్పీ వికారాబాద్ అసెంబ్లీ యూత్ కమిటీ ల సమీక్ష, నిర్మాణ కార్యక్రమ సభకు వారు ముఖ్య అతిథు లుగా హాజరయ్యారు. వారు మాట్లాడుతూ దేశంలో అత్య ల్ప సంఖ్యలో ఉన్న బ్రాహ్మణ వర్గం 80 శాతం ఉన్న బడు గు బలహీన వర్గాల ప్రజలను మోసం చేస్తూ వారి ఓట్లతో రాజకీయ అధికారాన్ని చేపట్టి అన్ని రంగాల్లో మోసం చేస్తూనే వస్తున్నారని వారు ఆరోపించారు. దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఎస్సీ ,ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాల ప్రజల అభివద్ధిని నీరుగార్చి దేశాన్ని దోచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ అత్యధిక సంఖ్యలో ఉన్న బీసీలకు ఇప్పటివరకు చేసిందేమీ లేదని రిజర్వేషన్ పెంపు సమస్యను గాలికొదిలి మాయమాటలతో వారి ఓట్లను దండుకునేందుకు కుట్రలు పన్నుతున్నార న్నారు. దేశంలో బిజెపికి ఎవరు ఎదురు మాట్లాడిన వారి పౖ అక్రమ కేసులు పెట్టి భయాందోళనకు గురి చేస్తున్నా రన్నారు. ఎన్నికల్లో 80 శాతం ఉన్న ఎస్సీ, ఎస్సీ, బీసీ మైనా ర్టీ వర్గాల ఓట్లతో గ్రామ స్థాయి నుండి అసెంబ్లీ పార్లమెం ట్ వరకు అన్ని స్థానాల్లో బహుజనులనే గెలిపించి బహుజ న రాజ్యం స్థాపించి నీలి జెండాను రెపరెపలా డించి అంబే ద్కర్ కన్న కలలు నిజం చేద్దాం అన్నారు. వికారాబాద్ జిల్లా నాయకులు అంజయ్య, సీఎం నర్సింలు, టి రాజు, యాద గిరి యాదవ్, క్రాంతి కుమార్ సంగారెడ్డి ఇన్చార్జి బాబురావు, మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌లు మాట్లాడుతూ బీఎస్పీని బలోపేతానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాల యువ నాయకులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కట్టెల మల్లేశం, మోమిన్‌పేట్ అధ్యక్షుడు రాజు, కోట్‌పల్లి అధ్యక్షుడు ఎన్ గోపాల్ బంట్వారం అధ్యక్షు డు సయ్యద్ బాబా, మర్పల్లి మండల నాయకులు హర్షవ ర్ధన్, ప్రభాకర్, విజరు, రవీం దర్, నరేష్ ఆయా గ్రామాల అధ్యక్షులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.