Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- దోమ
చంటి పిల్లవాన్ని తీసుకుని మహిళ అదృశ్యమైన ఘటన దోమ మండల పరిధిలోని బుద్లాపూర్ గ్రామంలో చోటుచేసుకున్నది. ఎస్ఐ విశ్వజన్ తెలిపిన వివరాల ప్రకారం బుద్లాపూర్ గ్రామానికి చెందిన వడిత్య శ్రీనివాస్ భార్య అంబిక(21)లకు ఈ నెల 21న రాత్రి భోజనం విషయంలో ఇద్దరు గొడవపడగా భర్త శ్రీనివాస్ ఆమెను చేతితో రెండు దెబ్బలు కొట్టా డు. ఈ విషయాన్ని మనసులో పెట్టు కున్న ఆమె మరుసటి రోజు ఉదయం భర్త పని నిమిత్తం వెళ్ళగా 3 నెలల బాబును తీసుకుని ఇంటి నుంచి చెప్పకుండా వెళ్ళిపోయిందని శ్రీనివాస్ తల్లి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చింది. విషయం తెలుసుకున్న భర్త చుట్టా లు, బంధువులు, తెలిసిన వారి దగ్గర వెతికిన ఎక్కడా ఆచూకీ లభించలేదన్నారు. అంబిక బయటికి వెళ్ళి న సమయంలో బ్లాక్ కలర్ శారీ, బ్లాక్ బ్లౌస్ దరించి ఉంద న్నారు. భార్య ఆచూకీ లభించలేదని శ్రీనివాస్ ఆదివారం పోలీ సులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యప్తు చేస్తున్నట్టు ఎస్ఐ విశ్వజన్ తెలిపారు.