Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మొన్న సీజ్.. నిన్న మెడికల్ క్యాంపు..
నవతెలంగాణ-షాద్నగర్
వైద్య ఆరోగ్య శాఖ తనిఖీల్లో భాగంగా శనివారం షాద్ నగర్ పట్టణంలో కొన్ని ప్రయివేట్ హాస్పిటల్లను అధికా రులు సీజ్ చేశారు.అలా సీజ్ చేశారో లేదో ఆదివారం నంది గామ మండల పరిధిలోని అప్పారెడ్డి గూడ గ్రామంలో మెడికల్ క్యాంపు నిర్వహించారు.గ్రామస్తులు ఆస్పత్రి సీజ్ చేశారు. అయినా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నారని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. అధికారులు సైతం సీజ్ చేసిన ఆస్పత్రి పేరుపైన మెడికల్ క్యాంపులు ఎలా నిర్వహిస్తారని మండిపడుతున్నారు. ఏది ఏమైనా నిబం ధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయనే ఆస్పత్రులను సీజ్ చేశారు. సీజ్ చేసిన ఆస్పత్రి పేరుపైన మెడికల్ క్యాంపు నిర్వహించడం విడ్డూరంగా ఉంది.