Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్
నవతెలంగాణ-షాద్నగర్
యువత స్వయం ఉపాధితో అభివృద్ధి చెందాలని అంతేకాకుండా కొంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పిం చాలని ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. ఆదివారం షాద్నగర్ పట్టణంలోని పరిగి రోడ్ లో గ్యాలక్సీ లైట్స్ ను మైనార్టీ నేత జమృత్ ఖాన్ అధ్వర్యంలో ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే అంజ య్య యాదవ్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా వా రు మాట్లాడుతూ షాద్నగర్ ప్రాంతంలో అందరికీ అందు బాటులో కొత్తగా ఇల్లు నిర్మించుకునే వారికి రకరకాల డిజైన్లతో లైట్స్ లభించడం గొప్ప విషయమన్నారు. రోజు రోజు షాద్నగర్ పట్టణం హైదరాబాద్ తరహాలో అభివృద్ది చెందుతుందన్నారు. యువత ఉద్యోగాలపై ఆధారపడకుం డా తమ స్వయం శక్తితో ఎదగడం మంచి ఆలోచన అన్నా రు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ నటరాజన్, కౌన్సిలర్ ప్రతాప్ రెడ్డి, పిల్లి శేఖర్, కో ఆప్షన్ మెంబర్ గౌస్ జాని,సింగిల్ విండో డైరెక్టర్ శ్రీను,ఖాజా, శరత్ కృష్ణ, చెట్ల నర్సింహ పాల్గొన్నారు.