Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్పంచ్ ఎగిరిశెట్టి గోదాదేవి సత్యం
నవతెలంగాణ-ఆమనగల్
తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగని మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షు లు, శెట్టిపల్లి సర్పంచ్ ఎగిరిశెట్టి గోదాదేవి సత్యం అన్నారు. ఆదివారం నుంచి బతుకమ్మ సంబురాలు అంగరంగ వైభ వంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షులు ఎగిరిశెట్టి గోదాదేవి సత్యం నవతెలంగాణతో మాట్లాడారు. తెలంగాణ ప్రజల సం స్కృతిని, పల్లె జీవనాన్ని చాటి చెప్పే ప్రకృతి పండుగ బతు కమ్మని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పండుగలపై ఆధు నిక ప్రభావం పడుతున్న బతుకమ్మ వేడుకల్లో నాటి సాం ప్రదాయమే కొనసాగుతుందన్నారు. ప్రజల బతుకుల్లో భా గమైన బతుకమ్మ వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాయన్నారు. తెలంగాణలో మహిళలంతా పూలను దే వుడిగా పూజిస్తూ ప్రకృతిని కాపాడాలని వేడుకునే ఈ పం డుగను తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు ఎమ్మెల్సీ కవి తా రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు నిర్వహిస్తూ పండుగ ప్రత్యేకతను ప్రపంచానికి చాటిచెప్తున్నారని అన్నా రు. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని శెట్టిపల్లి గ్రా మంలో పంచాయతీ ద్వారా అందించే ఫిల్టర్ నీటిని కేవలం రెండు రూపాయలకే 20 లీటర్లు అందజేస్తున్నట్టు గోదా దేవి సత్యం పేర్కొన్నారు.