Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శంకర్పల్లి
ఉత్తమ సేవ చేసినందుకు ఉన్నతమైన అవార్డు రావడం ఎంతో సంతోషకరంగా ఉందనీ కొండకల్ తండా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు మర్పల్లి అశోక్ అన్నారు.టూరిజం అండ్ హాస్పిటల్ ఇండిస్టీ, ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హౌటల్ మేనేజ్ మెంట్ స్కూల్ ఆధ్వర్యంలో 2021-22 సంవత్స రంలో విద్యారంగంలో నిరంతరం విశేష సేవలు అందించే వారికి ఇచ్చే ప్రతిష్టాత్మక టీచర్ పార్ ఎక్సలెంట్ అవార్డు 2022, కొండకల్ తండా ప్రాథ మిక పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు మర్పల్లి అశోక్‌కు తెలంగాణా రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మెన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, ఐఐహెచ్ఎం డైరెక్టర్ ఎర్నెస్ట్ ఇమ్మన్యూయల్ కలిసి శనివారం రాత్రి గచ్చిబౌలిలోని మెరీడియన్ హౌటల్లో జరిగిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్ర మంలో అవార్డు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 12 ఏండ్లుగా కొండకల్ తండాలో విధులు నిర్వహిస్తూ దాతల సహకారంతో పాఠశాలలో మౌలిక వసతులు కల్పించినట్టు తెలి పారు. విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ అందించి, ఎంతో మంది నిరుపేద విద్యార్థులను వివిధ రెసిడెన్షి యల్ స్కూల్స్ లో అడ్మిషన్స్ కల్పించినందుకు, కాలినడకన బడికి వెళ్లే గిరిజన విద్యార్థునులకు సైకిళ్ళు అందించి, బడికి వెళ్లేలా ప్రోత్సహించేలా కృషి చేసినట్టు వివరించారు. చదువు మధ్యలో ఆగిన, చదువుకోవాలనే ఆసక్తి ఉన్న వాయోజనులకు, గృహిణీలకు ఓపెన్ స్కూల్ విధానంలో టెన్త్, ఇంటర్ విద్య అభ్యసించేలా కృషి చేసినందుకు, ఈ బహుమతి వరించిందని, టీచర్ పార్ ఎక్సలెంట్ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. నేటి బాలలే రేపటి పౌరులు అన్న పెద్దల మాటలను మదిలో పెట్టుకుని, మరింత బాధ్యతతో ప్రభుత్వ బడులలో చదువుకునే బడుగు, బలహీన వర్గాల పిల్లలకు మంచి నైతిక విలువలతో కూడిన గుణాత్మకమైన విద్యను అందించేందుకు కృసి చేస్తానని తెలిపారు.