Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-షాబాద్
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మూడోవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం షాబాద్ మండల కేంద్రంలో వాల్పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉద్యమకారులు మాట్లాడుతూ 30వ తేదీన కరీంనగర్లో నిర్వరహించ తలపెట్టిన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం 3వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ఉద్యమకారులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఉద్యమకారుల డిమాండ్లు తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఉద్యమకారుల డిక్లరేషన్లు ప్రకటించాలని తెలిపారు. ఉద్యమకారులకు పింఛన్లు, వడ్డీలేని రుణాలు, ఉచిత బస్సు పాసు, ఆరోగ్య కార్డులు, సంక్షేమ పథకాల్లో 20 శాతం వాటా కేటాయించాలని కోరారు. ఉద్యమకారులను తెలంగాణ స్వాతంత్ర సమరయోదులుగా గుర్తించి గౌరవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు కుమ్మరి చెన్నయ్య, ఇబ్రహీం, ఖలీల్, వెంకటస్వామి, మతీన్, నర్సింహారెడ్డి, గౌసియాబేగం, నర్సింహులు, శివకుమార్, మల్లారెడ్డి, లక్ష్మయ్య, బాల్రాజ్, మల్లేష్, బస్వరాజ్, కృష్ణ, జంగయ్య, లక్ష్మయ్య తదితరులున్నారు.