Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శంకర్పల్లి
గుర్రం జాషువా, బోయ భీమన్న, దున్న యుద్ధాసు కవుల జయంతి వేడుకలను ఆదివారం సామాజిక కార్యకర్తల ఆధ్వర్యంలో శంకరపల్లి బాలుర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వారి చిత్ర పటాలకు పూలమాలు వేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, సామాజిక కార్య కర్త శ్రీనివాస్ మాట్లాడుతూ గుర్రం జాషువా డాక్టర్బి.ఆర్ అంబేద్కర్‌కు సమకాలికులు అంబేద్కర్ కంటే నాలుగేండ్లు చిన్నవారైన కవిరేణ్యుడు తన కండకావ్యం గబ్బిలంలో నాటి సామాజిక వ్యవస్థ మూలాలను అమాననియా దౌర్జన్యాన్ని కరుణారస భరితంగా వర్ణించి సాహిత్య వేదికపై మానవ జాతిని మేల్కొల్పిన సంఘ సంస్కర్త అని కొని యాడారు. జాతీయోద్యమ స్ఫూర్తితో దేశభక్తి కొత్త పుంతలు తొక్కుతున్న సమయాన పేదల పక్షాన నిలబడ్డ దార్శనికులు గుర్రం జాషువా అన్ని కొనియాడారు. అలాంటి జాషువా గురజాడ కన్యాశుల్కం, బోయ భీమన్న పాతేరు ,జాషువా గబ్బిలం వంటి సాంఘిక నవలలు కుల వ్యవస్థను సామాజిక అంతరాన్ని నిరసిస్తూ వెలువడిన సాహిత్యానికి శతాబ్దాల చరిత్ర ఉందన్నారు.పాలకూరి సోమన్న యోగివేమన దున్న ఇద్దాసు పోతులూరి వీరబ్రహ్మం నారాయణ గురు భారత దేశంలో సామాజిక పరివర్తన దిశగా తమదైన ముద్ర వేశారాన్ని గుర్తు చేశారు. ఈ ముగ్గురు కవులు భారతీయ తత్వం భాషలో సాంస్కృతిక చారిత్రక వైభవాన్ని ఈ లోకా నికి తెలియ పరిచిన మహానీయులని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్సీసీ ఆకాష్ ,అఖిల్, సునీల్ ,విశ్వనాథ్, వైభవ్, విజయ్, కుమార్, రాజు ,శివశంకర్ ,గోపీచంద్, అశ్వియా ఉన్నారు.