Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చందానగర్
హాఫిజ్ పెట్ డివిజన్ పరిధిలో ఉన్న ఇంజినీర్స్ ఎనక్లేవ్ కమ్యూనిటీ హాల్ 1లో అపోలో హాస్పిటల్ జూబ్లీహిల్స్ వారి సౌజన్యంతో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 10 నుంచి 2 గంటల వరకు ఉచిత వైద్య శిబిరం నిర్వహిం చారు. ఈ శిబిరంలో ఎత్తు, బరువు,రక్తపోటు, షుగర్ ,పల్స్ ,కంటి దంత, పరీ క్షలతో పాటు ఈసీజీ మొదలగు పరీక్షలు నిర్వహించారు. వైద్యులు డాక్టర్ ఫయాజ్ జనరల్ ఫిజిషన్ , డాక్టర్ రవితేజ రుద్రురాజు, ఆర్తో, డాక్టర్ రామ్స్ నేత్ర వైద్యులు , డాక్టర్ నవీన్ జక్కుల డెంటల్ , వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ మారిన జీవనశైలిలో పర్యావరణంలో వస్తున్న అనేక మార్పుల వల్ల అనేక వ్యాధులకు గురవుతున్నారని అన్నారు. ప్రస్తుత ఉన్న పరిస్థితుల్లో ఆరోగ్యమే మహాభాగ్యగా భావించి, ప్రతి ఒక్కరూ నిత్యవ్యాయామం, మెడిటేషన్, యోగ, ధ్యానం చేయాలని సూచించారు. సాధ్యమైనంత వరకు తాజా ఆకుకూరలు, సీజనల్ ఫ్రూట్స్ ,పాలు, పాల ఉత్పత్తులు, చేపలు, గ్రుడ్లు ,తణధాన్యాలు, డ్రై ఫ్రూట్స్ వంటి పౌష్టికాహారం తీసు కుని ఆరోగ్యం కాపాడుకోవాలని కోరారు. సాధ్యమై నంత వరకూ ఆల్కహాల్, పొగాకు, పొగాకు ఉత్పత్తులు, ఇతర మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు. అనారోగ్యంగా ఉంటే, అశ్రద్ధ చేయ కుండా, వెంటనే వైద్యులను సంప్రదించి, వారి సూచనలు, సలహాలు పాటించి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ నాయకులు ఆంజనేయ రాజు, జయపాల్ రెడ్డి, కరుణాకర్ గౌడ్, రంగారావు, గోపాలరావు, జేన్ రావు, డీఎస్ ప్రసాద్, రామిరెడ్డి, ప్రభాకర్ రావు, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు విష్ణు ప్రసాద్ , శ్రీను, జనార్ధన్, హాస్పిటల్ ప్రతినిధి అజిత్ త్రిపారితదితరులు పాల్గొన్నారు.