Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్
నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్
క్రీడల్లో క్రమశిక్షణ పట్టుదలతో సాధన చేస్తే, ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని టీఆర్ఎస్ వికారా బాద్ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. ఆదివారం వికారాబాద్ పట్ట ణంలోని అనంతగిరిపల్లి శివ రెడ్డి పేట్ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో నిర్వ హించిన 'జోనల్ లెవెల్ స్పోర్ట్స్ మీట్'ను ఆయన ప్రారంభించారు. మొదటగా అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాల వేసి, నివాళులర్పించి, జ్యోతి ప్రజ్వలన చేశారు. విద్యార్థులు నిర్వహించిన క్రీడా ప్రదర్శనలను తిలకించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రమశిక్షణ, పట్టుదలతో సాధన చేస్తే క్రీడల్లో ఉజ్వల భవిష్యత్తు ఉంటుం దన్నారు. గురుకులాల్లో చదివే విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని క్రీడలలో పాల్గొనాలని తెలిపారు. విద్యార్థులు ఎవరికి ఎవరు తక్కువ కాదనీ పట్టుదల ఉండాలన్నారు. జ్ఞానం అనేది ఎవరికి సొంతం కాదనీ, కష్టపడి పని చేస్తే ఎవరికైనా వస్తుందన్నారు. చదువుతోపాటు ఆటలలో ఆసక్తి చూపాలనీ, మనకు మనం తక్కువ అంచనా వేసుకోవద్దని సూచించారు. గురుకులాల విద్యార్థులు ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కి అందరికీ ఆదర్శంగా నిలిచారని గుర్తు చేశారు. గెలిచినవారు ముందు ప్రణాళికలతో విజయాలు సాధించాలనీ, ఓడిన వారు ఓటమిని గుణపాఠంగా తీసుకుని భవిష్యత్తు ప్రణాళికను సిద్ధం చేసుకోవాలన్నారు. గురుకుల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తు న్నారని వెల్లడించారు. గురుకులాలకు ప్రత్యేక స్థానం కల్పింస్తున్నారనీ, అందుకే మన కృషిని మెచ్చుకుని 18 రాష్ట్రాల నుంచి మూడు దేశాల నుంచి ప్రతినిధులు వచ్చి తెలంగాణలో నిర్వహి స్తున్న గురుకులాల విద్య వ్యవస్థను అధ్యాయనం చేశారని వెల్లడించారు. క్రీడాకారులకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకుని మరింత కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్‌రెడ్డి, కౌన్సిలర్లు పుష్పలతరెడ్డి, అనంతరెడ్డి, శ్రీదేవి, పట్టణ ఉపాధ్య క్షులు పి. అనంతరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్ పి విజరు కుమార్, నాయకులు రమణ, ఈశ్వర్, కాశయ్య, రాము, అంజయ్య, బుచ్చయ్య, అధికారు లు, పార్టీ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.