Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మధుసూదన్ రెడ్డి
నవతెలంగాణ-కందుకూరు
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బి. మధుసూదన్ రెడ్డి అన్నారు. ఆది వారం కందుకూరు మండల కేంద్రంలో పాషా, నర హరి స్మారక కేంద్రంలో రైతు సంఘం జిల్లా నాయ కులు దుబ్బాక రామచందర్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధర లేకుండా, ఎరువుల ధరలు విపరీతంగా పెంచారని అన్నారు. రైతుల భూ సమ స్యలు పరిష్కరించకపోవడంతో రైతులు కలెక్టర్, ఆర్డీవో, తహసీిల్దార్ కార్యాలయల చుట్టూ తిరుగుతు న్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు రుణమాఫీ చేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫల మైందన్నారు. రైతుల అనేక సమస్యలతో బాధపడు తున్నారని, ప్రభుత్వం స్పందించి రైతుల భూ సమ స్యలు పరిష్కరించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలపై, ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో ఉపసంహరించుకోవడం జరిగిందని గుర్తు చేశారు. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి రైతుల భూ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
రైతు సంఘం కందుకూరు మండల ప్రధాన కార్యదర్శిగా గండు మహేందర్
రైతు సంఘం కందుకూరు మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రైతు సంఘం మండలాధ్యక్షులుగా కాకి మధుసూదన్, ప్రధాన కార్యదర్శిగా గండు మహేందర్, ఉపాధ్యక్షులుగా పి. మహేందర్, శ్రీనివాస్, చిర్ర నరసింహ, సహాయ కార్యదర్శిలుగా ఆర్. యాదయ్య, కృష్ణ ,సత్తయ్య, కమిటీ సభ్యులుగా జంగయ్య, కాళిదాస్, శంకరయ్య, శ్రీరాములు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక జిల్లా ఉపాధ్యక్షులు బి. శ్రీనివాస్, వ్యవసాయ కార్మిక సంఘం మండల ప్రధాన కార్యదర్శి ఏ. కుమార్,కేవీపీఎస్ మండల కార్యదర్శి ఆర్ చందు, గొర్రెల మేకల పెంపకదారుల సంఘం అధ్యక్షులు గౌర శ్రీశైలం పాల్గొన్నారు.