Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సిలి వేరు రాజు
నవతెలంగాణ-మంచాల
ఈ నెల 28న మండలంలోని అన్ని గ్రామాల్లో భగత్ సింగ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సీలివేరు రాజు డివైఎఫ్ఐ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆదివారం మండల కేంద్రంలోని కా,, కాచము కష్ణమూర్తి భవన్లో డివైఎఫ్ఐ మండల కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 28 న ఉదయం 9 గంటలకు ప్రతి గ్రామంలో భగత్ సింగ్ జయంతి వేడుకలు నిర్వహించాలని తెలిపారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి ఆర్ స్వామి, మండల కమిటీ సభ్యులు హాఫిజ్ పాషా, రామకష్ణ, ప్రభాకర్, రవీందర్, వినోద్, నాయకులు లెనిన్, నరేష్ తదితరులు ఉన్నారు.