Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ కపాటి పాండురంగారెడ్డి, మంత్రి సబితా ఇంద్రారెడ్డికి వినతి పత్రం అందజేత
నవతెలంగాణ-కందుకూరు
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న దళిత నాయకులకు దళిత బంధు పథకం మంజూరు చేయాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కపాటి పాండురంగారెడ్డి ఆదివారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాసంలో మంత్రికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్న దళిత నాయకులకు 2 శాతం ఇస్తే వారి కుటుంబాలు ఆర్థికంగా అభివద్ధి అవుతారని మంత్రి దష్టికి తీసుకు వచ్చారు. అనేక కేసులతో జైలులో, అకారణంగా శిక్షలు అనుభవించి ఎంతో మంది కుటుంబాలు చిన్నాభిన్నం అయ్యాయని తెలిపారు. రెండు శాతం దళిత బంధు పథకం కేటాయిస్తే బాగుంటుందన్నారు. సీఎం కేసీఆర్ దష్టికి తీసుకువచ్చి అమలు చేయాలని కోరారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న దళితుల నాయకులకు న్యాయం చేసిన వారిమి అవుతామని కోరారు.