Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బసవ భవన్ భూమిపూజకు తరలి రావాలి
- జహీరాబాద్ ఎంపీ బీబీ. పాటిల్
నవతెలంగాణ-కొడంగల్
హైదరాబాద్లోని కోకాపేటలో అక్టోబర్ రెండవ తేదీ న సీఎం కేసీఆర్ నిర్వహించనున్న బసవ భవన్ శంకుస్థాపన కార్యక్రమానికి నియోజకవర్గంలోని వీరశైవ లింగయత్ సభ్యులందరూ తరలిరావాలని జహీరాబాద్ ఎంపీ. బీబీ. పాటిల్ పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణం లోని శ్రీ జగద్గురు నిరంజన మఠం అధ్యక్షులు ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్ అధ్యక్షతన వీరశైవ లింగయత్ సమావే శంలో ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు, రాష్ట్రంలోని వీరశైవుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తూ అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నా రు. ఇదే క్రమంలో ట్యాంక్ బండ్ పైన మహాత్మ బసవేశ్వర విగ్రహం ఏర్పాటు చేశారని అన్నారు. వీరశైవ లింగాయత్ సభ్యులు విద్య, ఉద్యోగ, రాజకీయ, సామాజిక రంగాలలో ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటూ సంఘటితంగా అభివృద్ధి చెందేందుకు కృషి చేయాలని అ న్నారు. అనంతరం శ్రీ జగద్గురు నిరంజన మఠం పీఠాధిపతులు శ్రీ సిద్ధి లింగ మహాస్వామి మాట్లాడుతూ బసవ భవన్ భూమి పూజకు వీరశైవులు అధిక సంఖ్యలో హాజరుకావాలని, సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాలను సభ్యులు పాల్గొని జయప్రదం చేయాల ని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి సీడీసీ చైర్మన్ ఉమాకాంత్ పాటిల్, వివి హాస్టల్ మాజీ అధ్యక్షులు హేరూ రి విజయకుమార్, విశ్వ లింగాయత్ ట్రస్ట్ అధ్యక్షులు పసారం శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సింగేరి కేరి సతీష్, బండపల్లి శివశరణప్ప, వాలీ బసవరాజ్, ఆత్మకూర్ నాగేష్, అర్చకులు మల్లికార్జున్, విజరు, శేఖరయ్య, అంగడి రైచూ ర్ బసవరాజ్, కోస్గి శశిధర్, సోమశేఖర్, పుల్లప్ప, దౌల్తా బాద్ లింగప్ప, నాగభూషణం, హస్నాబాద్ మల్లేశం, శ్రీశై లం, మాటూరు శివమూర్తి, జంగం జగదీష్, విశ్వనాథం, తదితరులు పాల్గొన్నారు.