Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆత్మవిశ్వాసంతో పయనిస్తే విజయం మనదే..
- జాయింట్ సెక్రెటరీ జనరల్ జై. పద్మావతి
- పాల్గొన్న వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్
నవతెలంగాణ వికారాబాద్ కలెక్టరేట్
తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర జోనల్ స్థాయి క్రీడల ప్రారంభ వేడుకలు వికారాబాద్ బుగ్గ రోడ్డులోని శివారెడ్డిపేట సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠ శాలలో అట్టహాసంగా ప్రారంభమైయ్యాయి. ఈ ప్రారంభ వేడుకలకు ముఖ్య అతిథులుగా స్థానిక వికారాబాద్ శాసనసభ్యులు డాక్టర్ మెతుకు ఆనంద్, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ సంయుక్త కార్యదర్శి శ్రీమతి పద్మావతి, రంగారెడ్డి హైదరాబాద్ ప్రాంతీయ సమన్వయ అధికారిణి డాక్టర్ శారదా వెంకటేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గురుకులాల విద్యాలయాల సంస్థ సంయుక్త కార్యదర్శి జే. పద్మావతి మాట్లాడుతూ గురుకులాలలో విద్య తోపాటు ఆటలు కూడా తగిన ప్రాధాన్యత ఇస్తున్నామని విద్యార్థులు మంచిగా ఎదిగి ఉన్నతమైన స్థానాలకు చేరుకో వాలని కోరుకుంటామని క్రీడలను ఉత్సాహపరితంగా ఎలాంటి లోటు లేకుండా చక్కగా నిర్వహించినటువంటి నిర్వాహకులను ఆమె అభినందించారు. తెలంగాణ రాష్ట్రం గురుకుల ప్రాధాన్యతతో విద్యార్థుల అభివృద్ధి కోసం సముచిత స్థానం కల్పిస్తున్నదని ఆమె అన్నారు. ఈ మంచి అవకాశాన్ని విద్యార్థులు ఉపయోగించుకొని భవిష్యత్తులో ఎదగాలని కోరారు. రంగారెడ్డి, హైదరాబాద్ ప్రాంతీయ సమన్వయ అధికారిణి డాక్టర్ శారద వెంకటేష్ మాట్లాడు తూ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల విద్యార్థులు చదువులోనే కాకుండా క్రీడారంగంలో కూడా రాష్ట్ర,జాతీయ స్థాయిలో రాణిస్తున్నారని అన్నారు. ఆత్మవిశ్వాసంతో ప్రయ త్నిస్తే విజయం మనదేనని క్రీడాకారులను ఉత్సాహప రిచారు. 1984లో ప్రారంభమైన గురుకులాలు దినదినా భివృద్ధి చెందుతున్నాయని అన్నారు. తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని ఎవరైనా అడిగితే తనకు 5,000 మంది పిల్లలు ఉన్నారని చెప్తానని తెలిపారు. విద్యార్థులను ఎప్పుడూ తన పిల్లలు లాగా భావించానని వారి అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నామని అని అన్నారు. ఓపిక ఉన్నంత వరకు పోరాటం కాదని ఊపిరి ఉన్నంతవరకు పోరాడాలని సూచించారు. జీవితం చాలా ముఖ్యమైందని దానిని సరైన పద్ధతిలో నడిపించుకుని మంచి జీవితాన్ని జీవించాలని ఆమె కోరారు. ఓడిపోయామని కృంగిపోద్దు ఓడిపోయిన వారి జీవితాలను అప్పటి పూర్తికి చీకటిగా ఉండొచ్చు మరుసటి రోజు మాత్రం వెలుగు వస్తుందని అన్నారు. విజ యం ఎవరికి సొంతం కాదని ఎవరు నిరంతరం శ్రమిస్తే వారి వశం అవుతుందని దానికోసం నిరంతరం శ్రమిం చాలని సూచించారు. దానికోసం ప్రయత్నం చేయాలని ఎవరు ఏమి చేస్తారని ఎదురు చూడకుండా నీ విజయానికి నీవే కష్టపడాలని ఆమె అన్నారు. నీ మీద నీవు విశ్వాసం ఉంచుకొని ప్రయత్నించాలని జీవితాన్ని ఎప్పుడు ప్రేమిం చాలి అప్పుడే జీవితంలో మనం ఏదైనా సాధించాలని పట్టు దల ఉంటుందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఆ ర్సిఓ ఎం.శ్రీనివాస్ రెడ్డి, డీసీఓ పి.అపర్ణ, క్రీడల జోనల్ ఆఫీసర్ ఉదయ భాస్కర్, ప్రిన్సిపల్ జేజే ప్రవీణ్ కుమార్, స్థానిక పీడీ చందర్, కొత్తగాడి గురుకులాల వైస్ ప్రిన్సిపాల్ నవనీత, స్థానిక కౌన్సిలర్ శ్రీదేవి రెడ్యానాయక్, ఇతర కౌన్సిలర్లు లంకా పుష్పలతారెడ్డి, అనంతరెడ్డి, నాయ కులు కృష్ణ, రమణ మాజీ కౌన్సిలర్ ప్రభాకర్‌రెడ్డి, స్థానిక నాయ కులు విజరు కుమార్, వెంకట్, ఈశ్వర్ పాల్గొన్నారు.