Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి నిరంజన్ రావు
నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్
జాతీయ సామాజిక- ఆర్థిక సర్వే 79వ పర్యాయంలో భాగంగా చేపట్టిన సీఏఎంఎస్ ఆయుష్ సర్వేకు జిల్లా ప్రణాళిక గణాంక శాఖ శ్రీకారం చుట్టింది. పూడూరు మండలంలోని తిరుమలాపూర్ గ్రామంలో జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి నిరంజన్‌రావు శనివారం సర్వేను ప్రారంభించారు. జిల్లాలో ఎంపిక చేసిన ఎనిమిది గ్రామాలు ఎనిమిది పట్టణ ప్రాంతాల్లో సరే నిర్వహించును న్నారు. ఈ సర్వే 2022 జూన్ నుంచి 2023 వరకు కొనసాగే ఈ సర్వేలో వివిధ ప్రభుత్వ పథకాలు, వాటి అమలు తీరుపై వివరాలు సేకరించనున్నారు. ప్రజల ఆర్థి క అవసరాలు, ఆదాయ వ్యవసాయలు, జీవనశైలి, ఆరోగ్య, వైద్య విధానంపై జాతీయ స్థాయిలో చేపట్టిన సమగ్ర సర్వే జిల్లాలో ఎంపిక చేసిన ప్రాంతలోనే నిర్వహించనున్నారు. ఈ సర్వేపై మండల ప్రణాళిక, గణాంక అధికారులకు శిక్షణ ఇచ్చారు. ఈ సర్వేలో ప్రతి కుటుంబానికి సంబం ధించిన వివరాలను పూర్తిగా ఆన్లైన్లో పొందుపర చనున్నారు. ఈ ప్రక్రియ కోసం ట్యాబ్ లు వినియోగించను న్నారు. ఈ సర్వే ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో అవసరమైన మార్పులు చేర్పులు చేపట్టనున్నట్లు గణాంకాల అధికారి నిరంజన్ తెలియజేశారు.