Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శంకరపల్లి
నియోజకవర్గంలోని ఆడపడుచులందరికీ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ చీరలు పంపిణీ చేయడం జరుగుతుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాల యాదయ్య అన్నారు. సోమవారం శంకర్పల్లి మున్సిపల్ పరిధిలోని మనీ గార్డెన్లో మహిళలకు ఎమ్మెల్యే బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. భారతదేశంలోని ఏ రాష్ట్రంలో చేయని అభివృద్ధి, సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెడుతు న్నారని అన్నారు. చిన్న గ్రామా లను కూడా గ్రామ పంచాయతీలు చేసిన ఘనత సీఎం కేసీ ఆర్కే దక్కుతోందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్, జడ్పిటిసి గోవిందమ్మ గోపాల్ రెడ్డి, ఎంపీడీవో వెంకయ్య, తహసీల్దార్ నయీముద్దీన్, మున్సిపల్ కమిషనర్ బి యాదగిరి, పొద్దుటూరు సర్పంచ్, సర్పంచ్ సంగం మండల అధ్యక్షుడు నర్సింహారెడ్డి, పొద్దుటూరు ఎంపిటిసి ప్రవళిక వెంకట్రెడ్డి, మహారాజుపేట సర్పంచ్ దోసాడ నరసింహారెడ్డి, గోపులారం సర్పంచ్ శ్రీనివాస్, దొంతంపల్లి సర్పంచ్ అశ్విని సుధాకర్, కౌన్సిలర్లు చంద్రమౌళి, సిహెచ్ అశోక్ , గోపాల్ లక్ష్మమ్మ రాంరెడ్డి, శ్వేతా పాండురంగారెడ్డి, సొసైటీ చైర్మన్ శశిధర్ రెడ్డి, పరివేద ఎంపిటిసి వెంక టరెడ్డి ,సంకె పల్లి ఎంపిటిసి మేఘనా సంజీవరెడ్డి, టిఆర్ ఎస్ మండల అధ్యక్షుడు గోపాల్, మున్సి పల్ అధ్యక్షులు వాగ్దేవి కన్నా, మున్సిపల్ సిబ్బంది, ఆయా గ్రామాల కార్యదర్శులు ఉన్నారు.