Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పర్వదినం సందర్భంగా సీఎం కేసీఆర్ ఆడపడుచులకు సారెగా అందించిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీ లో శేరిలింగంపల్లి సర్కిల్ డీసీ వెంకన్న, ప్రాజెక్ట్ ఆఫీసర్ మాన్వి, కూకటట్ పల్లి డివిజన్ కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ, ఎమ్మెల్యే గాంధీ మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంహెచ్. ఓ నగేష్నాయక్, శానిటేషన్ సూపర్వైజర్ జలందర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ వీరెశంగౌడ్, డివిజన్ అధ్యక్షులు రాజుయాదవ్, టీఆర్ఎస్ నాయకులు చింతకింది రవీందర్, పొడుగు రాంబాబు, పద్మారావు, కొండల్ రెడ్డి, రమేష్, మల్లేష్ యాదవ్, వేణు గోపాల్ రెడ్డి, రమణ, మహేష్, లింగారెడ్డి, పవన్, రజిని ఉన్నారు.
భారతీ నగర్ డివిజన్ ఎంఐజిలో..
భారతి నగర్ డివిజన్ పరిధిలోని ఎంఐజి సొసైటీ ఆఫీస్లో డీసీ వెంకన్న, ప్రాజెక్ట్ ఆఫీసర్ మాన్వి, కార్పొరేటర్ సింధు ఆదర్శ్రెడ్డిలతో కలిసి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మహిళలకు బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏ.ఎం.హెచ్.ఓ నగేష్ నాయక్, శానిటేషన్ సూపర్ వైజర్ జలందర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు మోహన్ గౌడ్,నాగమణి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆదర్శ్ రెడ్డి, తిలవాత్, సంపత్, చిన్న, మహిళ అధ్యక్షురాలు జ్యోతి, రాణి యాదవ్, శ్రీదేవి, అనిత, స్వర్ణలత, లక్ష్మీ, బేబీ, రాధ, సంధ్య, మంజుల, నరేందర్, కాలనీ డైరెక్టర్లు సత్యనారాయణ, సీనియర్ సిటిజన్ అధ్యక్షులు రాధాకృష్ణ పాల్గొన్నారు.