Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చేవెళ్ల
నైజాం రాజ్యం పతనానికి పునాదులు వేసిన దీరవనిత చాకలి ఐలమ్మ అని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య , కాంగ్రెస్ డీసీసీ మాజీ అధ్యక్షుడు పడాల వెంకట స్వామి, కాంగ్రెస్ చేవెళ్ల సీనియర్ నాయకులు సున్నపు వసంతం కొనియాడారు. సోమవారం మండల కేంద్రంలో చేవెళ్ల రజక సంఘం ఆధ్వర్యంలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి, సిపిఐ పార్టీల నాయకులు చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా చేవెళ్ల పట్టణ కేంద్రంలో ఐలమ్మ విగ్రహానికి పూల మాలాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ అన్యాయాన్ని నిలదీసి, వివక్షపై వీరోచితంగా పోరాడిన యోధురాలు ఐలమ్మ అని తెలిపారు. భూస్వాములు, ప్రభుత్వం అధికారికంగా ఐలమ్మ వేడుకలను నిర్వహి స్తుందన్నారు. కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీపీ ఎం. విజయలక్ష్మీ, వైఎస్ ఎంపీపీ కర్నె శివప్రసాద్, చేవెళ్ల గ్రామ సర్పంచ్ బండారి శైలజాఅగిరెడ్డి, మాజీ ఎంపీపీ ఎం. బాల్ రాజ్, ఉప సర్పచ్ గంగి యాదయ్య, జిల్లా రజక జేఏసీ మాజీ చైర్మెన్ దేవుని శర్వలింగం, రజక సంఘం ఉమ్మడి జిల్లా డైరెక్టర్ జె. మల్లేశ్. జిల్లా రజక సంఘం కార్యదర్శి జంగయ్య, నాయకులు పాల్గొన్నారు.