Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శంకరపల్లి
దళిత బంధు దేశానికి ఆదర్శమని చేవెళ్ల ఎమ్మెల్యే కాల యాదయ్య అన్నారు. సోమవారం శంకర్పల్లి మున్సిపల్ పరిధిలోని వార్డు కార్యాలయం రామంతాపూర్‌లో యెల్లకొండ జగన్‌కి దళితబంధు పథకం మంజూరైనందున ఎమ్మెల్యే కాలే యాదయ్య చేతుల మీదుగా భవన నిర్మాణ సామాగ్రి అంద జేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సాత విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్,వైస్ చైర్మన్ భానురి వెంకట్రామ్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ బద్దం శశిధర్ రెడ్డి, కౌన్సిలర్లు సిహెచ్.అశోక్, చంద్రమౌళి, తెల్లపురం గోపాల్, కో-ఆప్షన్ మెంబెర్ వెంకట్ రెడ్డి, మున్సిపల్ టీఆర్ఎస్ అధ్యక్షుడు వాసుదేవ్ కన్న, జూల కంటి పాండురంగా రెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా భూమికోసం భుక్తికోసం వెట్టిచాకిరీ విముక్తి కోసం పోరాడిన చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా శంకర్ పల్లి నందు ఐలమ్మ విగ్రహానికి పూల మాలలు వేసి కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో నాయకులు, జడ్పీటీసీ గోవిందమ్మ గోపాల్ రెడ్డి జూలకంటి లక్ష్మమ్మ రాంరెడ్డి, రజక సంఘం మండల అధ్యక్షుడు మల్లేష్ , పూల పెంటయ్య, మండల మున్సిపల్ నాయకులు పాల్గొన్నారు.