Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీడబ్లూజేఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి షఫీ
నవతెలంగాణ- కొడంగల్
జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని టీడబ్లూజేఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి షఫీ అన్నారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర విస్తత స్థాయి సమావేశం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వికారాబాద్ జిల్లా కార్యదర్శి ఎండి షఫీ హాజరై మాట్లాడుతూ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ జర్నలిస్టులకు ఇండ్ల్ల స్థలాలు ఇవ్వాలని, ప్రభుత్వం ఇస్తుంటే సుప్రీంకోర్టుకు ఏలాంటి అభ్యంతరం లేదని చెప్పి, నెల రోజులు గడుస్తున్నా ప్రభుత్వం జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వడంలో కాలయాపన చేస్తుందన్నారు. గతంలో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరితే హైకోర్టులో కేసు ఉండటంతో ఇవ్వలేకపోతున్నామని తెలిపినట్టు వెల్లడించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పినా , నేటికి రాష్ట్ర ప్రభుత్వం ఇండ్ల స్థలాలు ప్రకటించలేదన్నారు. ఇప్పటికైనా టీఆర్ఎస్ ప్రభుత్వం స్పందించి, జర్నలిస్టులందరికీ ప్రభుత్వం వెంటనే ఇండ్ల స్థలాలు కేటాయించాలని కోరారు.