Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీపీ వై రవీందర్ యాదవ్
నవతెలంగాణ-కేశంపేట
టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే తెలంగాణ రాష్ట్రం అంచలంచలుగా అభివద్ధి చెందుతున్నదని ఎంపీపీ వై రవీందర్ యాదవ్ అన్నారు. సోమవారం కొత్తపేట కార్మిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆవరణలో పిఎసిఎస్ అధ్యక్షులు గండ్ర జగదీశ్వర్ గౌడ్ అధ్యక్షతన మహాజన సభ సమా వేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీతోపాటు, జడ్పీటీసీ తాండ్ర విశాల శ్రావణ్ కుమార్ రెడ్డిలు హాజరయ్యారు. ఈసంద ర్భంగా ఎంపీపీ మాట్లాడుతు రైతులకు పలు సూచనలు, వ్యవసాయ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నదాతలకు అండగా నిలుస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువులపై ధరలు పెంచి పేద ప్రజలపై అధిక భారం వేస్తుందని దుయ్యబట్టారు. గతంలో ఒక ఎమ్మెల్యేను కల వాలంటే ఎన్నో అవస్థలు పడవలసి వచ్చేదని, కానీ నేడు అలాంటి పరిస్థితి లేదన్నారు.సామాన్య ప్రజ లను కూడా కలుపుకుపోయే గుణం ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్ కు ఉందని తెలిపారు. బతుకమ్మ చీరల పంపిణీ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు అందజేస్తున్న బతుకమ్మ చీరలు ఎంపీపీ, జడ్పిటిసిలు పంపిణీ చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ మహిళల అభివద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో షాద్ నగర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నారాయణ రెడ్డి, పీఏసిఎస్ ఉపాధ్యక్షులు అంజి రెడ్డి, డైరెక్టర్లు కృష్ణయ్య, మధుసూదన్ గౌడ్, చంద్రశేఖర్, స్థానిక సర్పంచ్ నవీన్ కుమార్, ఎంపీటీసీ మల్లేష్ యాదవ్, ఉప సర్పంచ్ నరేష్ యాదవ్, మండల కో ఆప్షన్ సభ్యులు జమాల్ ఖాన్, నాయకులు శ్రీనివాసులు, జగన్ రెడ్డి, వెంకట్ రెడ్డి, జగన్ నాయక్, లక్ష్మయ్యలతోపాటు తదితరులు పాల్గొన్నారు.