Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి
- యాచారంలో బతుకమ్మ చీరెల పంపిణీ
నవతెలంగాణ-యాచారం
మహిళల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వంపెద్దపీట వేసిందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. సోమవారం యాచారం మండల కార్యాలయంలో మహిళలకు ఎమ్మెల్యే బతుకమ్మ చీరెల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మహిళల ఆత్మగౌరాన్ని పెంచేందుకు కల్యాణలక్ష్మి, షాది ముబారక్, పెద్ద మొత్తంలో పొదుపు సంఘా లకు రుణాల మంజూరు వంటి పథకాలు ప్రవేశపెట్టినట్టు తెలిపారు. దేశ స్వాతంత్రం వచ్చి 75 వసంతాలు పూర్తి చేసుకున్న బీజేపీ పాలిత రాష్ట్రాలలో మహిళలకు రక్షణ కరువైందన్నారు. రాబోయే రోజుల్లో మహిళల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభు త్వం మరిన్ని పథ కాలను ప్రవేశపె డుతుందన్నారు. ఈ కార్య క్రమంలో ఎంపీపీ కొప్పు సుకన్య భాషా, జడ్పీటీసీ చిన్నోళ్ల జంగమ్మ యాదయ్య, ఎంపీడీవో విజయలక్ష్మి, పీఎసీఎస్ చైర్మెన్ కోటిరెడ్డి రాజేందర్ రెడ్డి, సర్పంచులు ఎండీ హబీబుద్దిన్, బండిమీది కృష్ణ మాదిగ, చిగురంత శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ రెడ్డి, ఉదయశ్రీ, సంతోష, ఎంపీటీసీలు మోరుగు శివలీల, బాబు, శారదా, డైరెక్టర్లు పాశ్చ భాషా, మక్కపల్లి స్వరూప, తదితురులు పాల్గొన్నారు.