Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
ప్రకృతిని, పూలను ఆరాధిస్తూ, స్త్రీలను గౌరవించే మహత్తర పండుగ బతుకమ్మ పండుగ అని కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అన్నారు. సోమవారం కొండాపూర్ డివిజన్ పరిధిలోని అంజయ్య నగర్‌లోని వార్డు ఆఫీసులో ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరెలను మహిళలకు అందజేశారు.అనంతరం వారు మాట్లాడుతూ భారతదేశంలో ఏ రాష్ట్రంలోను లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ, సీఎం కేసీఆర్ ప్రజల మన్ననలు పొందుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ వెంకన్న, శానిటేషన్ ఇన్స్పెక్టర్ జలంధర్‌రెడ్డి, ఏఎంహెచ్‌వో నగేష్, కొండాపూర్ డివిజన్ ప్రెసిడెంట్ అబ్బుల కృష్ణగౌడ్, సెక్రటరీ జె.బలరాం యాదవ్, నాయకులు జంగంగౌడ్, శ్రీనివాస్ గౌడ్, రూపరెడ్డి, రవి శంకర్ నాయక్, సిద్దిఖ్ నగర్ ప్రెసిడెంట్ బసవ రాజు, గణపతి, సాగర్ చౌదరి, ఆనంద్ చౌదరి, బుడుగు తిరుపతి రెడ్డి, స్వామి సాగర్, యాదయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.