Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కపాటి పాండురంగారెడ్డి
నవతెలంగాణ-కందుకూరు
గ్రంధాలయాలు విజ్ఞానానికి ప్రతిరూపాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కపాటి పాండు రంగారెడ్డి అన్నారు. సోమవారం మాజీ ఎంపీటీసీ మూల హనుమంత రెడ్డి అమెరికా ప్రయాణం తర్వాత ఆయన అంతర్జాతీయ పుస్తకాలను జిల్లా గ్రంథాలయ సంస్థ లో అందజేశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువతో సన్మానించి జ్ఞాపకను బహుకరించారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ పుస్తక పఠనం ప్రతి ఒక్కరికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థులకు, నిరుద్యోగులకు , ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారికి కూడా ఎంతో ఉపయోగప డుతుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగించుకోవాలని కోరారు.ఈ కార్యక్ర మంలో రైతు సంఘం నాయకులు గోపిరెడ్డి, సత్యనారాయణరెడ్డి, గ్రంథాలయ సిబ్బంది ప్రతాప్, జైహింద్, ప్రసన్న, మమత, పాల్గొన్నారు.