Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కందుకూరు
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ఉద్యమ నాయకురాలు చాకలి ఐలమ్మ పోరాటపటిమ చరిత్ర ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని జెడ్పీటీసీ బొక్క జంగారెడ్డి అన్నారు. సోమవారం కందుకూరు మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన ఐలమ్మ ఆశయాలను కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కందుకూరు సర్పంచ్ శమంతకమణీ, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షులు సురసానిరాజశేఖర్రెడ్డి, ఎంపీటీసీ కాకి రాములు, నాయకులు లక్ష్మీనరసింహా రెడ్డి, డైరెక్టర్ ఆనంద్, ఎస్ఐ కొండలు, సీపీఐ మండల కార్యదర్శి కేజీ శంకర్, రజక సంఘం మండలాధ్యక్షులు అక్కెనపల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కిషన్, కోశాధికారి బొమ్మరాజు రాజు, మాజీ సర్పంచ్ జంగయ్య, నాయకులు మల్లేష్, శ్రీనివాస్, వెంకటేష్, గణేష్, నరేష్ ,బాలరాజు, సత్తయ్య ,అంజయ్య ,జనార్ధన్ ,సుధాకర్ దేశ మోహన్ రెడ్డి, కుమార్ ,ఆంజనేయులు పాల్గొన్నారు.