Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్థానిక ఎస్ఐ నరసయ్య
నవతెలంగాణ-మహేశ్వరం
ప్రభుత్వ ఉద్యోగాలపై ఆధారపడకుండా నైపుణ్యం కలిగిన రంగాలలో శిక్షణ పొంది స్వయం ఉపాధి ఎంచుకోవాలని స్థానిక ఎస్ఐ నరసయ్య సూచించారు.మండల పరిధిలోని శ్రీ శారదా ఒకేషనల్ కళాశాలలో మాస్టర్ మైండ్స్ సొల్యూషన్స్ కంప్యూటర్ ఎడ్యుకేషన్లో శిక్షణ పొంది, ఉత్తీర్ణులైన విద్యార్థులకు సర్టిఫికెట్ అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై, మాట్లాడుతూ నిరుద్యోగ యువతీ, యువకులు కంప్యూటర్ రంగంలో ముందుకు దూసుకెళ్లాలని అన్నారు. ప్రస్తుత సమాజంలో చదువుతోపాటు కంప్యూటర్ పరిజ్ఞానం చాలా అవసరమన్నారు. విద్యా ర్థులు మంచి క్రమశిక్షణతో గురువులను గౌరవించి, చదువుతో పాటు దేశ అభివృద్ధిలో పాలు పంచుకోవాలని సూచించారు. అనంతరం శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్ అందజేయడం జరిగింది. కంప్యూటర్ శిక్షణ నిర్వాహకులు సురేష్ మాట్లాడుతూ మరింత మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చి అనేక రంగాలలో ప్రోత్సాహం కల్పిస్తామన్నారు. ఈ కార్యక్ర మంలో మాస్టర్ మైండ్ మేనేజ్మెంట్ డైరెక్టర్ మునావత్ దేవేందర్, శ్రీ శారద కళాశాల ప్రిన్సిపాల్ శివకుమార్ పాల్గొన్నారు.