Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజేంద్రనగర్ శాసనసభ్యులు టి.ప్రకాశ్‌గౌడ్
- శంషాబాద్‌లో 334 మంది లబ్ది దారులకు పింఛన్ కార్డులు పంపిణీ బతుకమ్మ , ఆశావర్కర్ల చీరెల పంపిణీ
నవతెలంగాణ-శంషాబాద్
సంక్షేమ అభివృద్ధి పథకాలు కలలుగన్న బంగారు తెలంగాణకు నిదర్శనమని రాజేంద్రనగర్ శాసనసభ్యులు టి. ప్రకాశ్‌గౌడ్ అన్నారు. సోమవారం శంషాబాద్ మండల పరిధిలోని మండల పరిధిలోని నర్కూడ గ్రామంలో 84 మంది, కాచారంలో 29 మంది, సుల్తాన్‌పల్లిలో 43 మంది, నానాజీపూర్‌లో 40 మంది, రామంజపూర్‌లో 40 మంది, మల్కారంలో 334 మంది లబ్దిదారులకు నూతన పింఛన్ కార్డులు, ఆశావర్కర్లకు ఒక జత బట్టలు ఎమ్మెల్యే అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వరాష్ట్రం తెలంగాణ ఏర్పడక ముందు, తెలంగాణ ఏర్పడిన తర్వాత జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి, ప్రజలు ఆయా రచ్చబండల దగ్గర చర్చించాలన్నారున. గతంలో పింఛన్ ఇవ్వడానికి నానా తంటాలు పడిన నాటి పాలకులు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారన్నారు. తెలంగాణ సాధించుకున్న తర్వాత అర్హులైన లబ్దిదారులకు రూ. 2016 , రూపాయలు, వికలాంగులకు, ఇతరులకు రూ. 3016లు అంద జేస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దుక్కుతోం దన్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికీ తాగునీరు అందజేస్తున్నట్టు వెల్లడించారు.టీిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజల ఆదరాభిమానులతో తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దిద్యాల జయమ్మ శ్రీనివాస్, జడ్పీటీసీ నీరటి తన్విరాజు, వైస్ ఎంపీపీ నీలం మోహన్, ఎంపీడీవో వసంతలక్ష్మి, ఎంపీఓ సుజాత, సూపరింటెండెంట్ బి.ప్రతిభ, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దివ్య, నార్సింగి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ దూడల వెంకటేష్ గౌడ్ , పీఏ,సీఎస్ చైర్మెన్ బుర్కుంట సతీష్, సర్పంచులు దేవరకొండ రమేశ్, దండు ఇస్తారీ, పొగాకు రాంగోపాల్, సునిగంటి సిద్దులు, అయినాల కల్పన, కొత్త మాధవి, కె. నర్సమ్మ, వట్టెల సతీష్ కుమార్, ఎంపీటీసీలు, తొంట గౌతమి, క్రాంతి కుమార్, టీఆర్ఎస్ మండలాధ్యక్షులు కె.చంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి మోహన్‌రావు, నాయకులు జిట్టే సిద్దులు, యూఎస్ రాములు, నీరటి శేఖర్, హీరేకార్ శివాజీ, సందన వెళ్లి శ్రీనివాస్, గుండాల విశ్వనాథం, నీరటి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.