Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దీక్షలకు రాజకీయ పార్టీల మద్దతు
- దీక్షలో కూర్చుని నిరసన వ్యక్తం చేసిన నాయకులు
- న్యాయం జరిగే వరకూ అండగా ఉంటామని హామీ
- రోజురోజుకూ ఉధృతమౌతున్న ఉద్యమం
- భూములు దక్కే వరకూ ఉద్యమాలు
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కాడిగళ్ల భాస్కర్
- అరెస్టు చేసి పోలీసుస్టేషన్లకు తరలింపు
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
ఖానాపూర్ భూపోరు ఉధృతంగా సాగుతోంది. రైతు లు మూడు రోజులుగా దీక్షా శిబిరం ఏర్పాటు చేసుకొని నిరసన కొనసాగిస్తున్నారు. అక్కడే ఉంటూ నిరసన వ్యక్తం చేస్తున్న వారి దీక్షలకు రాజకీయ పార్టీల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోంది. అందులో భాగంగా మూడవ రోజు ఖానాపూర్ భూముల్లో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో కూర్చున్న రైతులకు సంఘీభావం తెలిపారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కాడిగళ్ల భాస్కర్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యు లు పి.యాదయ్య, సామెల్, కాంగ్రెస్ మాజీ శాసనసభ్యులు కోదండరెడ్డి, సీనియర్ నాయకులు ఈసీ శేఖర్‌గౌడ్, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి దండం రామ్‌రెడ్డితో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు పోరెడ్డి అర్జున్ రెడ్డి, కౌన్సిలర్ నాయిని సత్యనారాయణ, బీజేవైఎం గొప్పు భాషా, సీపీఐ(ఎం) మున్సిపల్ కార్యదర్శి ఎల్లేష్ తదితరులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాల ప్రజలను మోసం చేస్తుందన్నారు. గత ప్రభుత్వాలు వారికి ఇచ్చిన స్థలాలు సాగుభూమిలను వెనక్కి తీసుకుంటూ నిర్వసితులను చేస్తుందని మండిపడ్డారు. ఖానాపూర్ రెవెన్యూ పరిధిలోని 41/1లో గత ప్రభుత్వాలు సాగు కోసం భూ పంపిణీ చేసిందన్నారు. ఆ భూములను స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అవసరాల పేరుతో వెనక్కి తీసుకుంటున్నారని తెలిపారు. ఇప్పటికే ఆ భూముల్లో హక్కు పత్రాలు అంద జేస్తామని చెప్పి ఆర్డీఓ కార్యాలయం, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి భూములు తీసుకున్నారని చెప్పారు. ఆయినా ఖానాపూర్ రైతులకు న్యాయం చేయకపోగా ఉన్న భూమిలో నుంచి పూర్తిగా వెళ్లగొట్టేందుకే ప్రయత్నాలు చేస్తు న్నారని మండిపడ్డారు. ఇదేనా టీఆర్ఎస్ ప్రభుత్వ రాజనీతి అని ప్రశ్నించారు. ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం కోసం ఎలాంటి జీవోలు అడ్డు రావడంలేదు కానీ, పేదలకు మాత్రం ఇంటి జాగాలు ఇవ్వమంటే ఎందుకు జీవోలు అడ్డు వస్తున్నాయని ప్రశ్నించారు. కేవలం నెల రోజుల వ్యవధిలో ప్రతి కుటుంబానికీ రెండు ఇండ్ల స్థలాల చొప్పున అందజే స్తామని చెప్పిన అధికార యంత్రాంగం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రశ్నించారు. పైగా పేదోళ్లు భూముల మీదికి వస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు భయభ్రాంతులకు గురి చేస్తున్నా రని, ఇది సభకు కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకోవాలనుకుంటే ప్రభుత్వ ఇస్తామన్న ఇంటి స్థలాలను వెంటనే జారీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం కోసం ఏ విధంగానైతే అధికార పార్టీ అధికార యంత్రాంగం వ్యవహరించారో ఆ రీతిన పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలన్నారు. లేకుంటే అఖిలపక్ష ఆధ్వర్యంలో ఉద్యమాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. అధికార పార్టీ నాయకుల బెదిరింపులకు లొంగిపోవద్దన్నారు. జైలుకు వెళ్లినా తమ భూములను రక్షించుకునేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కడవరకు మీ వెన్నంటి ఉంటామని అభయమిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కౌన్సిలర్ నాయిని సత్యనారాయణ, బీజేపీ అశోక్ గౌడ్, కొప్పు బాషా, తిరుమల్ రెడ్డి, పొరెడ్డి అర్జున్‌రెడ్డి, స్టేట్ కిసాన్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ గుండ్ల వెంకట్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ కళ్లెం శ్రీధర్ రెడ్డి, అడల భిక్షపతి, మధు, రాంబాబు, రాజు పాల్గొన్నారు.