Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే టి. ప్రకాష్‌గౌడ్
- శంషాబాద్‌లో రెండు చోట్ల ఐలమ్మ విగ్రహావిష్కరణ
నవతెలంగాణ- శంషాబాద్
దొరలను, నైజాం రజాకార్లను ఎదిరించి తెలంగాణ యావత్తు ప్రజలకు స్ఫూర్తి నింపి ఆనాటి ఉద్యమానికి కేంద్ర బిందువుగా మారిన తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరనారి చిట్యాల ( చాకలి ) ఐలమ్మ బడుగు, బలహీన వర్గాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని రాజేంద్రనగర్ శాసన సభ్యుడు టి.ప్రకాష్‌గౌడ్ అన్నారు. చాకలి ఐలమ్మ జయంతి పురస్కరించుకొని సోమవారం శంషాబాద్ ఎంపీపీ దిద్యాల జయమ్మ శ్రీనివాస్ స్వగ్రామం పెద్ద తూ ప్రలో ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయించారు. శంషాబా ద్లోనీ ఎన్‌హెచ్ 44 ప్రక్కన సిద్ధాంతి ఊర చెరువులో కౌన్సిలర్ యెట్టి కుమార్ ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయించారు. ఈ రెండు చోట్ల ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై ఐలమ్మ విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణ కుటుంబంలో పుట్టిన ఐలమ్మ దొరలను ఎదిరించి నిలవడం అసామాన్య విషయమని కొనియాడారు. ఆమె స్ఫూర్తితో అలుపెరుగని మలిదశ పోరాటంలో తెలంగాణ సాధించుకోవడం జరిగిందన్నారు. తెలంగాణ స్వాతంత్ర సమరయోధుల జీవిత చరిత్రను వారు చేసిన త్యాగాలను నాటి ఉమ్మడి పాలనలో తొక్కి పెట్టారన్నారు. ఐలమ్మ పోరాటం మహిళా చైతన్యానికి పరిమితం కాదని అది తెలంగాణ యావత్ ప్రజలందరికీ బడుగు బలహీన వర్గాలకు దిక్సూచిగా పోరాట మార్గంగా హక్కుల కోసం నిలబడే శక్తిగా ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తుంద న్నారు. ఎంపీపీ జయమ్మ శ్రీనివాస్, కౌన్సిలర్ వై.కుమార్ మాట్లాడుతూ చాకలి ఐలమ్మ తమ సామాజికవర్గంలో జన్మించి స్ఫూర్తిదాయకమైన పోరాటాలు చేసి యావత్తు సమాజానికి గొప్ప నాయకురాలుగా తరతరాలు గుర్తించే వ్యక్తిగా ఆమె నిలవడం గర్వకారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో శంషాబాద్ జడ్పీటీసీ నీరటి తన్విరాజు, వైస్ ఎంపీపీ నీలం మోహన్, మున్సిపల్ చైర్ పర్సన్ కే.సుష్మ మహేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్, వీర్లపల్లి శంకర్ ఉప సర్పంచ్ దిద్యాల వెంకటయ్య, దూడల వెంకటేష్‌గౌడ్, కె.చంద్రారెడ్డి, ఎం.మోహన్‌రావు తదితరు లు పాల్గొన్నారు.