Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విధి నిర్వహణలో కత్తిపోట్లు దిగినా స్నాచర్లనును వదలని కానిస్టేబుల్ యాదయ్య చేతుల మీదుగా ప్రారంభం
- పోలీసుల్లో ఆత్మస్థైర్యం నింపడమే ఈ శిక్షణ లక్ష్యం
- సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర
నవతెలంగాణ-మియాపూర్
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సిటిసి పరేడ్ గ్రౌండ్లో సోమవారం 30 మంది పోలీసులకు డిఫెన్సివ్ ట్యాక్టికల్ ట్రైనింగ్‌ను కానిస్టేబుల్ యాదయ్య చేతుల మీదుగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, జాయింట్ సీపీ అవినాష్ మహంతితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ 'హైదరాబాద్ లోని బీహెచ్ఈఎల్ ప్రాంతంలో ఈ ఏడాది జూలై 26వ తేదీన మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఒక మహిళ ఒంటరిగా వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నది. కాగా ముగ్గురు దొంగలు బైకులపై వెనుక నుంచి వచ్చి ఒక్కసారిగా ఆమె మెడలోని చైన్ లాగి పారిపోయారు. దుండగులు దొంగతనం చేసి వస్తున్నారన్న సమాచారంతో సైబరాబాద్ సీసీఎస్ పోలీసులు యాదయ్య, రాజు వారిని ఫాలో అయ్యారు. అశోక్‌నగర్‌లో ఆ దొంగలను వీరు చుట్టుముట్టారు. వెంటనే దొంగల్లో ఒకడు తన బొడ్లో దాచిన కత్తి తీసి యాదయ్యపై విచక్షణరహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో యాదయ్య దుండగుడితో ప్రతిఘటించి వీరోచితంగా పోరాడాడు. అయితే స్నాచర్చ్ చేతిలో పదునైన ఆయుధాలు ఉండడంతో దుండగుడు.. కానిస్టేబుల్ యాదయ్యను 7 సార్లు కత్తితో పొడిచాడు. ఓ వైపు రక్తం చిందుతున్నా ఆ పోలీస్ మాత్రం దొంగలను ఉడుంపట్టు పట్టి అస్సలు వదల్లేదు. ఈడ్చు కొచ్చి ఆ ముగ్గురిని కటకటాల్లోకి నెట్టారు. ప్రజల ప్రాణాలకు భద్రత కల్పిస్తున్న పోలీసులు విధి నిర్వహణలో వారే ప్రాణాలు కోల్పోతున్నారు. దుండగులు తమ కార్యకలాపాలు యథ ేచ్ఛగా నిర్వహించుకునేందుకు అవసరమైతే పోలీసులను కాల్చి చంపుతూ వారి కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపుతున్నారు. ఇటీవలి కాలంలో దుండగుల చేతిలో పోలీసులు తరచుగా గాయపడటం, ఒక్కోసారి చనిపో వడాన్ని మనం తరచూ చూస్తున్నాం. ఇటువంటి సంఘట నలను దృష్టిలో ఉంచుకొని సైబరాబాద్ పోలీసులు 'డిఫెన్సివ్ టాక్టికల్ ట్రైనింగ్' ను ఏర్పాటు చేశామన్నారు. తాను 5 సంవత్సరాల కింద సైబరాబాద్ జాయింట్ సీపీ గా పనిచేసిన సమయంలో ఈ ట్యాక్టికల్ ట్రైనింగ్ కోర్సును రూపకల్పన చేశానని గుర్తు చేశారు. అప్పట్లో ఈ టాక్టికల్ ట్రైనింగ్ కేవలం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కే పరిమితం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేశార న్నారు. పోలీసులు ముందుగా తమను తాము రక్షించు కొని, ప్రజలను రక్షించుకున్నపుడే ప్రజల్లో పోలీసులపై నమ్మకం ఏర్పడుతుందన్నారు. ఇటీవల సైబరాబాద్ పరిధిలో పనిచేస్తున్న యాదయ్య అనే కానిస్టేబుల్ దుండగుడి చేతిలో కత్తిపోట్లకు గురయ్యారన్నారు. ఇటువంటి సంఘటనలు తిరిగి పునరావతం అవ్వకుండా ఉండేందుకు ఈ టాక్టికల్ ట్రైనింగ్ దోహదపడుతుం దన్నారు. సాధారణంగా పోలీసులకు ట్రైనింగ్ అఫెన్సివ్ ట్రైనింగ్ ఇస్తారని, తాము డిఫెన్సివ్ ట్రైనింగ్ ఇస్తామని చెప్పారు. ఎవరైనా మన పైన దాడి చేసినప్పుడు.. ఎలా ఆత్మ రక్షణ చేసుకోవలో, ప్రతిదాడి ఎలా చేయాలనే విష యాలు టాక్టికల్ ట్రైనింగ్‌లో నేర్పిస్తారన్నారు. అనంతరం కానిస్టేబుల్ యాదయ్య మాట్లాడుతూ.. దుండగులను త్ణను ఎలా ఎదుర్కున్నానో, తనపై కత్తిపోట్లను ఎలా చేశా రు. అయినప్పటికీ వారిని ఎలా చట్టానికి పట్టించానో వివరించారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ జాయింట్ సీపీ అవినాష్ మహంతి, సీసీఎస్ ఏడీసీపీ నరసింహారెడ్డి, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఏడీసీపీ రియాజ్, ఏసీపీ మట్టయ్య, ట్యాక్టికల్ ట్రైనింగ్ ట్రైనర్ నిశ్చల్, ఆర్ఐ సిద్ధార్థ నాయక్, ఆర్ఐ వెంకట స్వామి తదితరులు పాల్గొన్నారు.