Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 100 మంది పైబడి ఉద్యోగుల నుంచి రూ.లక్ష నుంచి రూ.2 లక్షలు వసూలు
నవతెలంగాణ-మియాపూర్
ఐటీ ఉద్యోగుల పేరుతో నిరుద్యో గులకు మరో ఐటీ కంపెనీ డబ్బులు వసూలు చేసి బోర్డు తిప్పేసింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం మాదాపూర్లోని హైటెక్ ప్రాంతంలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పేరుతో ఉద్యోగ ప్రకటన చేస్తూ నిరుద్యోగుల నుంచి లక్ష నుంచి రెండు లక్షల రూపాయలు వసూలు చేస్తూ ఫేక్ అపార్ట్మెంట్ ఆర్డర్ ఇచ్చింది. నెలకు రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు జీతం ఉంటుందని నమ్మబలికారు. వారి దగ్గర పెద్ద మొత్తంలో డబ్బు లు వసూలు చేశారు. ప్రభాకర్ అనే వ్యక్తి పూర్తిగా ఐటీ హెచ్ఆర్గా చెప్పుకుంటూ సుమారుగా 150 మంది నిరుద్యోగులు మోసం చేస్తున్నట్టు తెలిపారు. వీటిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు మాదాపూర్ పోలీసులు తెలిపారు.