Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ
నవతెలంగాణ-చందానగర్
చందానగర్ డివిజన్ పరిధిలోని బీహెచ్ఈఎల్ చౌరస్తా సమీపంలో ఉన్న ప్రీతి ఆస్పత్రిలో పక్కన ఉన్న గ్యాస్ గోదానాలపై రూ. కోటీ 70 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన కల్వర్ట్ బ్రిడ్జిని డీసీ వెంకన్న , కార్పొరేటర్లు మంజుల రఘునాథ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డిలతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ సోమవారం ప్రారం భించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ కల్వర్టు బ్రిడ్జిని ప్రారంభించుకోవడం సంతోషకరమన్నారు.గతంలో చిన్నదిగా ఉండటంతో వర్షాల మూలంగా పై భాగంలో కాలనీలు ముంపునకు గురవుతుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే వారని తెలిపారు. ఈ బ్రిడ్జి నిర్మాణంతో నీటి ప్రవాహం సాఫీగా సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్స్ అధికారులు ఈఈ నామ్యా, డీఈ హరీశ్, ఏఈ శివకృష్ణ, మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్, మాజీ కౌన్సిలర్లు రవీందర్ రావు, మోహన్ గౌడ్, లక్ష్మీనారాయణ గౌడ్, మాజీ సర్పంచ్ రాజేశ్వర్ రెడ్డి ,చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్, టీఆర్ ఎస్ నాయకులు ఆదర్శ్ రెడ్డి, జనార్ధన్ రెడ్డి, అబీబ్ బాయి, పులిపాటి నాగ రాజు, ఓ వెంకటేష్, రవీందర్రెడ్డి, వరలక్ష్మిరెడ్డి, పారునంది శ్రీకాంత్, అమ్జద్, పాషా, నరేందర్ బల్లా, కార్తిక్ గౌడ్,వజిర్ , ప్రవీణ్ రెడ్డి , ఉదరు కుమార్, ఇమ్రాన్ ,అఫ్సర్, గిరీ ,దీక్షిత్ రెడ్డి, అల్తాఫ్, రాజశేఖర్ రెడ్డి, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.