Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చందనవెల్లి, హైతాబాద్, భూనిర్వాసితులు
నవతెలంగాణ-షాబాద్
భూములు కోల్పోయిన తమకు న్యాయ పరంగా నష్టపరిహారం అందేంత వరకూ వెనక్కి తగ్గబోమని చందనవెళ్లి, హైతాబాద్ భూ నిర్వాసితులు అన్నారు. భూములు కోల్పోయిన తమకు పరిహారం అందించాలని నిర్వహిస్తున్న భూ నిర్వాసితుల ఆందోళనలు మంగళవారం 59వ రోజుకు చేరింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. న్యాయపరంగా తమకు అందాల్సిన పరిహారం అక్రమార్కులు, బినామీల జేబులోకి వెళ్లిపోయిందన్నారు. దీనికంతటికీ అధికారులు, ప్రజాప్రతినిధు లే కారణమని వారు ఆరోపించారు. న్యాయపరంగా తమకు అందాల్సిన పరిహారం కోసమే తాము పోరాటం చేస్తున్నాని చెప్పారు. అందుకోసం ఎన్నిరోజులైనా, ఎంత దూరమైనా వెళ్తామని స్పష్టం చేశారు. రైతులకు న్యాయం చేస్తా మని చెబుతున్న ప్రభుత్వం, న్యాయం కోసం అదే రైతులు ఆందోళన చేస్తున్నా పట్టించుకోక పోవడం విచారకరమన్నారు. ఇప్ప టికైనా సంబంధిత అధికా రులు స్పందించి, తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో భూనిర్వాసితుల సంఘం అధ్యక్షులు, నీరటి ఆంజనేయులు, సభ్యులు శోభ, అనంతం, అంతయ్య, ఎల్లేష్, నర్సింలు, దయాకర్, భాగ్యమ్మ, గూడూరు జంగయ్య, గిరిబాబు, బాలమణి, లంబాడి చావలి, కిషన్, అంజయ్య, మల్లేష్, కిష్టయ్య, యూసుఫ్, రైతులు క్రిష్ణయ్య, బాలకృష్ణ, హనుమంతు, సత్తయ్య, జరిన బేగం, మంజుల, యాదమ్మ సుగుణమ్మ, పుష్పమ్మా,బుగ్గమ్మ తదితరులు పాల్గొన్నారు.