Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ కందుకూరి
నవతెలంగాణ-తాండూరు
తెలంగాణ ఉద్యమంలో బీసీల పాత్ర కీలకమని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ కందుకూరి అన్నారు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకల సందర్భంగా మంగళవారం తాండూర్ నియోజవర్గ బీసీ సంఘం కన్వీనర్ రాజ్ కుమార్ కందుకూరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా ఇటీవల జిల్లా గ్రంథాలయ చైర్మన్గా నియమితులైన ఎస్ రాజుగౌడ్ను, బీసీ సంఘం వికారాబాద్ జిల్లా మహిళ అధ్యక్షురాలుగా నియమితులైన మధులత, శ్రీనివాసాచారిని గజమాలతో ఘనంగా సన్మా నించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ చైర్మెన్ రాజుగౌడ్ మాట్లాడుతూ గత 25 ఏండ్లుగా ఒక పక్క పార్టీల కోసం, మరోపక్క బీసీల కోసం నిరంతరం కృషి చేస్తున్నట్టు చెప్పారు. రాబోయే రోజుల్లో చట్టసభల్లో రిజర్వేషన్ల కోసం బీసీలంతా ఐక్యంగా ఉద్యమించాలని సూచించారు. బీసీ జాతీయ కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ మాట్లాడుతూ.. బీసీ సంఘం ఏలాంటి కార్యక్రమం తీసుకున్న రాజుగౌడ్ పార్టీలకతీతంగా ముందుం డేవారు అని అదేవిధంగా ఇకముందు కూడా బీసీల సమస్యలను పరిష్కారం అయ్యే విధంగా బీసీ సమీకృత భవనం సాధన కోసం రాజుగౌడ్ కృషి చేయాలని కోరారు. వికారాబాద్ జిల్లా మహిళా అధ్య క్షురాలు మధులత శ్రీనివాసాచారి మాట్లాడుతూ.. బీసీ మహిళలకు పటిష్టత కోసం సామాజిక అభివృద్ధి కోసం తన వంతు బాధ్యత నిర్వహిస్తానని తెలిపారు. కార్యక్రమంలో బీసీ రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ షుకూర్, బీసీ మహిళా నియోజవర్గ అధ్యక్షురాలు జ్యోతి, వికారాబాద్ జిల్లా నాయకులు గడ్డం వెంకటేష్, మహిళా సంఘం నాయకురాలు ఉపాధ్యక్షురాలు అనిత, ప్రధాన కార్యదర్శి విజయ లక్ష్మి, ఆర్గనైజింగ్ సెక్రటరీ మంజుల, యాలాల బీసీ మండలాధ్యక్షులు లక్ష్మణాచారి, మండల యువజన సంఘం అధ్యక్షులు బసంత్ కుమార్, బీసీ యువ నాయకులు రాము ముదిరాజ్, వెంకట్, టైలర్ రమేష్, పరమేష్, కాళికాదేవి ఆలయ కమిటీ మెం బర్ భాస్కర్, వెంకట్చారి, దుబారు వెంకట్, శ్రీను, మాదేవ్ మతిన్, బీసీ నాయకులు, బీసీ యువ నాయకులు, వివిధ కులాలకు చెందినటువంటి అధ్యక్ష కార్యదర్శులు బీసీ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని జిల్లా గ్రంథాలయ చైర్మెన్ రాజుగౌడ్, వికారాబాద్ జిల్లా మహిళా అధ్యక్షురాలు మధులత శ్రీనివాస్ చారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.