Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కందుకూరు
మత్స్యకార్మికులు చేపల మార్కెటింగ్ చేసుకోవడానికి ప్రభుత్వం సహకరిస్తుందినీ జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి అన్నారు. కందుకూరు మండలం కేంద్రంలో మంగళవారం 24 గ్రామ పంచాయతీలకు ఆరు లక్షల చేప పిల్లల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి సరఫరా చేసే చేప పిల్లలను కందుకూరు మండలానికి తీసుకువచ్చారని 24 గ్రామ పంచాయతీల మత్స్య కార్మికులకు చేప పిల్లలను పంపిణీ చేసినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ యాలాల శ్రీనివాస్, నాయకులు పోలేమోని అశోక్ వివిధ గ్రామాల చెందిన మత్స్య కార్మికులు పాల్గొన్నారు.