Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేటర్ తోకల శ్రీనివాస్‌రెడ్డి
నవతెలంగాణ-రాజేంద్రనగర్
మైలార్‌దేవ్‌పల్లి డివిజన్లోని ప్రతీ బస్తీలో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నట్టు డివిజన్ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం డివిజన్ పరిధిలోని ఉడంగడ్డలో హాలియా దాసరి నూతన కమ్యూనిటీ హాల్ కోసం జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి కార్పొరేటర్ పర్యటించారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని కొన్ని బస్తీలలో నిధుల కొరత కారణంగా కొన్ని ప్రధాన సమస్యలను పరిష్క రించలేక పోతున్నామని ఆయన అన్నారు. బస్తీలలో అండర్ గ్రౌండ్ డ్రయినేజీ సమస్య చాలా తీవ్రంగా ఉందని ఆయన తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్‌లో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో చాలా ప్రాంతాల్లో అభివృద్ధి పనులు పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించారు. జిహెచ్ఎంసి అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. జిహెచ్ఎంసి అధికారులు నిత్యం బస్తీలలో పర్యటించి ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో దళిత మోర్చా అధ్యక్షులు బాబు, కిరణ్, దేవులపల్లి స్వామి, దాసు, రావుల భాస్కర్, పండు యాదవ్, మజర్, శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.